The Movie That Disappointed Fans Most In 2018


The Movie That Disappointed Fans Most In 2018

2018లో అభిమానుల్ని అమితంగా నిరాశపర్చిన చిత్రం

అభిమానులకు తమ హీరో సినిమా వస్తున్నదంటే అంతకు మించిన పండగ వేరే ఉండదు. అగ్ర కథానాయకుల్లో 2018లో పవన్ కళ్యాణ్, మహేశ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వాళ్ల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్టవడంతో చరణ్ ఫ్యాన్స్ సంబరాలకు అంబరమే హద్దుగా నిలిచింది. ‘భరత్ అనే నేను’ హిట్ తో మహేశ్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ‘అరవింద సమేత’ పాక్షికంగా అయినా విజయం సాధించడంతో చిన్న ఎన్టీఆర్ అభిమానులు ఊరట చెందారు.

ఎటొచ్చీ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ అభిమానులే పండగ చేసుకోలేక పోయారు. బన్నీ సినిమా ‘నా పేరు సూర్య’ బయ్యర్లకు రూ. 30 కోట్ల మేర నష్టాలను కలిగించడంతో అభిమానులు నిరాశపడ్డారు. అయితే అందరి కంటే ఎక్కువగా బాధకు గురయ్యింది మాత్రం పవన్ కల్యాణ్ అభిమానులే. అగ్ర హీరోగా అమేయమైన ఫాలోయింగ్ ను ఆస్వాదిస్తున్న పవన్ 2018 మొదట్లోనే ‘అజ్ఞాతవాసి’గా అభిమానుల ముందుకు వచ్చాడు. అదివరకు ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను పవన్ కు అందించిన డైరెక్టర్ త్రివిక్రమ్ రూపొందించడంతో ‘అజ్ఞాతవాసి’పై అంచనాలు అంబరాన్ని అంటాయి. కానీ వాటి దరిదాపుల్లో కూడా ఆ సినిమా రాలేదు. సాధారణ ప్రేక్షకులతో పాటు పవన్ అభిమానులూ ఆ సినిమా చూసి నీరసపడ్డారు. ఫలితంగా 2018 తొలి డిజాస్టర్ గానే కాకుండా, బిగ్గెస్ట్ డిజాస్టర్ గానూ నిలిచింది. అంతేనా! పవన్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ ఖ్యాతిని కూడా దక్కించుకుంది.