‘Thuneega’ Girl To Pair Opposite Megastar’s Son-in-law


'Thuneega' Girl To Pair Opposite Megastar's Son-in-law

చిరంజీవి అల్లుడి సరసన ‘తూనీగ’ గాళ్!

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ 2018లో ‘విజేత’ సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా విజేత కాకపోయినా నటుడిగా కల్యాణ్ దేవ్‌కు పాస్ మార్కులు వచ్చాయి. ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అతను ఇప్పుడు రెండో సినిమా చెయ్యడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు పులి వాసు దర్శకత్వం వహించనున్నాడు.

కాగా ఈ చిత్రంలో నాయికగా రియా చక్రవర్తి ఎంపికైనట్లు సమాచారం. సుమంత్ అశ్విన్ హీరోగా పరిచయమైన ‘తూనీగ తూనీగ’ చిత్రం ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో ఆమె మళ్లీ కనిపించలేదు. ఈ మధ్యలో హిందీ సినిమాలు చేసిన ఆమె, ఇన్నాళ్ల తర్వాత మరో అవకాశం తెలుగులో దక్కించుకుందని తెలుస్తోంది.