Vinaya Vidheya Rama Overseas Collections: Worst Disaster


Vinaya Vidheya Rama Overseas Collections: Worst Disaster

వినయ విధేయ రామ ఓవర్సీస్ కలెక్షన్స్: దారుణమైన డిజాస్టర్

రాంచరణ్‌ను యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా చూపిస్తూ బోయపాటి శ్రీను రూపొందించిన ‘వినయ విధేయ రామ’ ఓవర్సీస్ మార్కెట్‌లో దారుణంగా దెబ్బతిన్నది. పెట్టుబడి విలువలో 10 రోజుల్లో కేవలం 20 శాతం మాత్రమే వసూలు చేయడం ద్వారా దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. రూ. 7 కోట్ల విలువకు గాను ఈ సినిమా వసూలు చేసింది కేవలం రూ. 1.4 కోట్లు! ఓవర్సీస్‌లో ‘వినయ విధేయ రామ’ కథ దాదాపు ముగిసినట్లే. 80 శాతం నష్టాలతో బయ్యర్లు విలవిలలాడుతున్నారు. అదే చరణ్ గత సినిమా ‘రంగస్థలం’ ఓవర్సీస్‌లో 16.4 కోట్లను వసూలు చేయడం గమనార్హం. మరోవైపు ఓవర్సీస్‌తో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో మెరుగైన స్థితిలో వసూళ్లు సాధించగలిగింది ఈ సినిమా. ఇప్పటివరకు (10 రోజుల్లో) అక్కడ పెట్టుబడి విలువలో 70.7 శాతాన్ని రికవర్ చేయగలిగింది. ఏదేమైనా ఆ ప్రాంతాల్లో కనీసం 25 శాతం నష్టాలు రావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ నష్టాల విలువ తక్కువేమీ కాదు. ఏకంగా రూ. 20 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. అత్యధికంగా నైజాం ఏరియా బయ్యర్లు నష్టపోతున్నారు. అక్కడ 35 శాతం మేర నష్టాలు రావడం తప్పదంటున్నారు.