Where Is The Venkata Lakshmi?


Where Is The Venkata Lakshmi?

వెంకటలక్ష్మి ఎక్కడ?

రాయ్‌లక్ష్మి (లక్ష్మీరాయ్) టైటిల్ రోల్ పోషిస్తోన్న తెలుగు చిత్రం ‘వేరీజ్ ద వెంకటలక్ష్మి’. చాలా కాలం తర్వాత ఆమె నాయికగా తెలుగులో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కిశోర్‌కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తయారవుతున్న ఈ చిత్రంలో వెంకటలక్ష్మిగా రాయ్‌లక్ష్మి అటు ఆనందం, ఇటు విషాదం మేళవించిన పాత్ర చేస్తున్నారు. ఆమె పాత్ర ఎంతగా అలరిస్తుందో, అంతగా హృదయాల్నీ స్పృశిస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. 2018లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా నిర్మాణంలో జరిగిన జాప్యం కారణంగా 2019లో వస్తోంది.

ఈ సినిమా గురించి రాయ్‌లక్ష్మి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “2019 is all about good news !Cant ask for a better start !!! 2019 has to many things to offer u all Coming soon #WhereIsTheVenkatLakshmi #telugufilm #mynextsoonforrelease” అంటూ ఆమె ట్వీట్ చేశారు. దానితో పాటు తన లుక్ ఉన్న పోస్టర్‌నూ ఆమె జత చేశారు. హరి గౌర సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు తటవర్తి కిరణ్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. కార్తీక్, పూజిత పొన్నాడ, ప్రవీణ్, మధునందన్, బ్రహ్మాజీ, ‘జబర్దస్త్’ మహేశ్ తారాగణం.