Where Is The Venkatalakshmi Has Finished Filming


Where Is The Venkatalakshmi Has Finished Filming
Where Is The Venkatalakshmi Has Finished Filming

‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ షూటింగ్ పూర్తయింది

లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్ కామెడీగా  తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఇటీవలే ఈ చిత్రం నుంచి వచ్చిన ‘పాపా నీకేదంటే ఇష్టం’ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. మాస్ హంగులు జోడించి ఈ పాటను చిత్రీకరించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా, త్వరలో టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రంలో నటిస్తున్న హాస్యనటులు ప్రవీణ్, మధునందన్ కామెడీ హైలైట్ గా నిలవనుంది. హరి గౌర ఈ చిత్రానికి సంగీతం అందించగా, వెంకట్ ఆర్. శాఖమూరి సినిమాటోగ్రఫీని అందించారు. ఏబీటి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై గురునాథ్ రెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమాకి ఎం. శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మార్చిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

One thought on “Where Is The Venkatalakshmi Has Finished Filming

Comments are closed.