2 Surya Kiran Aircraft Collides In Mid-Air, 1 Pilot Feared Dead & 2 Injured


2 Surya Kiran Aircraft Collides In Mid-Air, 1 Pilot Feared Dead & 2 Injured

బెంగళూరులో గాలిలో ఢీకొన్న ఎయిర్‌క్రాఫ్టులు.. ఇద్దరు సురక్షితం.. ఒకరి మృతి?

భారత వాయు దళానికిని చెందిన రెండు సూర్యకిరణ్ ఎయిర్‌క్రాఫ్టులు బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్ వద్ద గాలిలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. అఏరో ఇండియా 2019 ఎక్స్‌పో కోసం చేస్తున్న రిహార్సల్స్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఒక పైలెట్ మరణించి ఉంటారని ఆందోళన చెందుతున్నారు. మరో ఇద్దరు పైలెట్లు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

బుధవారం బెంగళూరులో మొదలు కాబోతున్న ఏరో ఇండియా వార్షిక ఎక్స్‌పో నిమిత్తం రిహార్సల్స్ చేస్తున్న సందర్భంగా ఆ రెండు ఎయిర్‌క్రాఫ్టులు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక పైలెట్ మృతి చెంది ఉంటాడని ఆందోళన చెందుతున్నట్లు కర్ణాటక ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ డీజీపీ ఎంఎన్ రెడ్డి తెలిపారు. మరో ఇద్దరు పైలెట్లు కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారనీ, అయితే ఇద్దరూ గాయపడ్డారనీ ఆయన చెప్పారు.

యలహంక ఎయిర్‌బేస్ దగ్గర ఈ ఘటన జరిగినప్పటికీ, కొన్ని శకలాలు ఇస్రో లేఅవుట్ సమీపంలో పడ్డాయి. ఒక ఏవియేషన్ వెబ్‌సైట్‌కు పనిచేస్తున్న అంగద్ సింగ్ అనే ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం గాలిలో విన్యాసాలు చేస్తున్న సందర్భంలోనే రెండు ఎయిర్‌క్రాఫ్టులు పరస్పరం ఢీకొన్నాయి.

ఒక ఎయిర్‌క్రాఫ్టులో ఒక పైలెట్ ఉండగా, రెండో ఎయిర్‌క్రాఫ్టులో ఇద్దరు పైలెట్లు ఉన్నారనీ తెలుస్తోంది. ఒక దానిలోని ఇద్దరు పైలెట్లు డోర్ తెరుచుకొని కిందికి దూకేయగా, ఇంకో దానిలో ఉన్న పైలెట్ దూకలేదు. అతను మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

2 Surya Kiran Aircraft Collides In Mid-Air, 1 Pilot Feared Dead & 2 Injured