5 Hindi Horror Films You Need To See


5 Hindi Horror Films You Need To See
13B

మనం చూడాల్సిన 5 బాలీవుడ్ హారర్ సినిమాలు

బాలీవుడ్ సినిమా అంటే భారీ యాక్షన్ సినిమాలకూ, రొమాంటిక్ మూవీస్‌కీ, కామిక్ సినిమాలకూ ఎంత ప్రసిద్ధి చెందిందో, హారర్ సినిమాలకూ అంతే పేరు పొందింది. దేశంలో మిగతా అన్ని భాషల్లో ఏడాదికి ఎన్ని హారర్ సినిమాలు తయారవుతుంటాయో, అన్ని హారర్ సినిమాలు హిందీలో రూపొందుతుంటాయి. భయపెట్టే పాత్రలు, ఒళ్లు జలదరింపజేసే సన్నివేశాలు, ఉత్కంఠను పరాకాష్టకు తీసుకెళ్లే కథనం.. వెరసి హారర్ సినిమా చూసిన అనుభవమే వేరు. కొన్ని సినిమాలు చూశాక మనకు చీకటిని చూసినా, ఒంటరిగా ఉండాలన్నా వణికి పోతుంటాం. సరే.. బాలీవుడ్‌లో మనం చూడాల్సిన అలాంటి 5 హారర్ క్లాసిక్స్ ఏవో చూద్దాం.

13బి: ఫియర్ హాజ్ ఎ న్యూ అడ్రెస్ (2009)

కథాంశం: మనోహర్ (మాధవన్) ఒక కొత్త అపార్ట్‌మెంట్ కొంటాడు. అక్కడ అతనికి మానవాతీత అనుభవాలు ఎదురవుతాయి. అతని ఇంట్లోని టీవీలో ఒక సీరియల్ ప్రసారమవుతుంటుంది. ఆ సీరియల్ అతని కుటుంబ భవిష్యత్తును భయానక రీతిలో చూపించడమే అందులోని విశేషం.

కథ, దర్శకత్వం: విక్రమ్ కె. కుమార్

సంగీతం: శంకర్-ఎహ్సాన్-లాయ్

తారాగణం: మాధవన్, నీతూ చంద్ర, పూనం థిల్లాన్, శరణ్య, సచిన్ ఖడేకర్, రవిబాబు, సంపత్ రాజ్, మురళీ శర్మ

5 Hindi Horror Films You Need To See
Phir Wahi Raat

ఫిర్ వహీ రాత్ (1980)

కథాంశం: డాక్టర్ విజయ్ (రాజేశ్ ఖన్నా) ఒక సైకియాట్రిస్ట్. ఆశ (కిం) అనే ఒక అందమైన యువతిని ప్రేమిస్తాడు. అయితే ఇంకో డాక్టర్ ఆమె ఒక మానసిక సమస్యతో బాధపడుతుందంటూ ఆమెను విజయ్‌కు రిఫర్ చేస్తాడు. రాత్రిపూట ఒక స్త్రీ తనపై దాడిచేసి, చంపడానికి ప్రయత్నిస్తోందని ఆశ భ్రమిస్తోందని అతను చెప్తాడు. దిగ్భ్రాంతికి గురైన విజయ్ ఏం చేశాడనేది మిగతా కథ.

దర్శకుడు: డేనీ డెంజోప్ప

సంగీతం: ఆర్.డి. బర్మన్

తారాగణం: రాజేశ్ ఖన్నా, కిం, అరుణా ఇరానీ, తమన్నా, శశికళ, డేనీ డెంజోప్ప, ఎ.కె. హంగల్, సురేశ్ ఓబరాయ్, లలితా పవార్, ఓం శివ్‌పురి, జగ్‌దీప్

5 Hindi Horror Films You Need To See
Raat

రాత్ (1992)

కథాంశం: శర్మ (ఆకాశ్ ఖురానా) కుటుంబం ఒక సెమి-అర్బన్ ఏరియాలోని ఇంటికి మారుతుంది. అక్కడ అనూహ్యమైన ఘటనలు జరుగుతుంటాయి. ప్రమాదవశాత్తూ చనిపోయిన పిల్లి తిరిగొస్తుంది. శర్మ కూతురు మనీషా (రేవతి) స్నేహితురాలు దారుణ హత్యకు గురవుతుంది. శర్మ పైనా, మనీషా ప్రియుడు దీపక్ (చిన్నా) పైనా హత్యాయత్నాలు జరుగుతాయి.

దర్శకుడు: రాంగోపాల్ వర్మ

సంగీతం: మణి శర్మ

తారాగణం: రేవతి, రోహిణి హట్టంగడి, ఓం పురి, ఆకాశ్ ఖురానా, అనంత్ నాగ్, చిన్నా, జయా మాథుర్, నిర్మలమ్మ, తేజ్ సప్రు

5 Hindi Horror Films You Need To See
Mahal

మహల్ (1949)

కథాంశం: హరిశంకర్ (అశోక్ కుమార్) ఒక కొత్త ఇంటికి వస్తాడు. అక్కడి తోటలో అతనికి ఒక స్త్రీ పాడుతూ కనిపిస్తుంది. దగ్గరకు వెళ్లేసరికి మాయమైపోతుంటుంది. ఆ ఇంట్లో ఇద్దరు ప్రేమికులు చనిపోయారని పనిమనిషి చెప్తాడు. అతను, హరిశంకర్ లాయర్ ఫ్రెండ్ శ్రీనాథ్ ఆ ఇంటిని వదిలేసి వెళ్లమని సలహా ఇస్తారు. దెయ్యం కథేమిటో తేల్చుకోవాలనుకుంటాడు హరిశంకర్.

దర్శకుడు: కమల్ ఆమ్రోహి

సంగీతం: ఖేంచంద్ ప్రకాశ్

తారాగణం: అశోక్ కుమార్, మధుబాల, విజయలక్ష్మి, ఎం. కుమార్, కాను రాయ్, ఎస్. నజీర్, నీలమ్

5 Hindi Horror Films You Need To See
Bees Saal Baad

బీస్ సాల్ బాద్ (1962)

కథాంశం: కామోద్రేకంతో ఒకమ్మాయిపై అత్యాచారం చేస్తాడు ఠాకూర్. ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. అనూహ్యంగా ఠాకూర్ హత్యకు గురవుతాడు. చనిపోయిన యువతి ఆత్మ అతనిపై పగ తీర్చుకుందని స్థానికులు భావిస్తారు. ఆ తర్వాత ఠాకూర్ కొడుకు, సోదరుడు కూడా హత్యకు గురవుతారు. ఠాకూర్ మనవడు కుమార్ విజయ్‌సింగ్ (బిస్వజిత్ ఛటర్జీ) విదేశాల నుంచి తిరిగొస్తాడు. తనవాళ్ల చావుకు కారణం తెలుసుకోవాడానికి ప్రయత్నిస్తాడు.

దర్శకుడు: బీరేన్ నాగ్

సంగీతం: హేమంత ముఖర్జీ

తారాగణం: బిస్వజిత్ ఛటర్జీ, వహీదా రెహ్మాన్, మన్మోహన్ కృష్ణ, మదన్ పురి, సజ్జన్, అసిత్ కుమార్ సేన్, లతా సిన్హా