Allu Arjun Gears Up To Prepare For Trivikram’s Film


Allu Arjun Gears Up To Prepare For Trivikram's Film
Allu Arjun Gears Up To Prepare For Trivikram’s Film

త్రివిక్రమ్ సినిమాలో కొత్త లుక్‌లో అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్‌కు న్యాయం చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త లుక్‌లో కనిపిస్తూ వస్తున్నాడు అల్లు అర్జున్. ఆర్మీ మ్యాన్‌గా ‘నా పేరు సూర్య’లో భిన్న రూపంలో కనిపించిన అతను ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేయబోతున్న సినిమాలో ఇప్పటివరకూ కనిపించని స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడని అంతర్గత వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆ లుక్ ప్రిపరేషన్‌లో బన్నీ ఉన్నాడు. అందుకు అనుగుణంగా రెగ్యులర్ షూట్‌ను మార్చి నుంచి నిర్వహించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. ఇదివరకు వారి కలయికలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు. ‘అజ్ఞాతవాసి’ వంటి ఇండస్ట్రీ డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్, ‘నా పేరు సూర్య’ వంటి ఫ్లాప్ తర్వాత బన్నీ ఈ సినిమా చేస్తున్నారు. అందుకే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలనే కసి ఇద్దరిలోనూ ఉంది. దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది నిర్మాతల సంకల్పం.

One thought on “Allu Arjun Gears Up To Prepare For Trivikram’s Film

Comments are closed.