Anupama To Pair Up With Bellamkonda Sreenivas


Anupama To Pair Up With Bellamkonda Sreenivas
Bellamkonda Sreenivas and Anupama Parameswaran

బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా అనుపమ

తమిళంలో విష్ణు విశాల్ హీరోగా నటించగా ఘన విజయం సాధించిన ‘రాక్షసన్’ సినిమా తెలుగులో రీమేక్ అవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. నాగశౌర్యతో చేసిన ‘అబ్బాయితో అమ్మాయి’ (2016) తర్వాత అతడు దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే.

కాగా ‘రాక్షసన్’ రీమేక్‌లో నాయికగా అనుపమా పరమేశ్వరన్ ఎంపికైనట్లు సమాచారం. ఒరిజినల్‌లో అమలా పాల్ చేసిన స్కూల్ టీచర్ కేరక్టర్‌ను అనుపమ చేయనుంది. తెలుగులో ఆమె చివరిసారిగా రాం సరసన ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాలో కనిపించింది.

దాని తర్వాత కన్నడంలో ‘నట సార్వభౌమ’తో అక్కడ పరిచయమైంది. ఫిబ్రవరి 7న విడుదలైన ఆ సినిమా హిట్టవడంతో అక్కడ కూడా మంచి డిమాండ్ సంపాదించుకుంది.

ఇప్పుడు తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా చేసేందుకు అంగీకరించింది. ఈ సినిమాని కోనేరు హవీశ్ లక్ష్మణ్ నిర్మిస్తున్నారు.