Anushka Sharma Finds One Of Her Doppelgangers!


Anushka Sharma Finds One Of Her Doppelgangers!
Anushka Sharma Finds One Of Her Doppelgangers!

అనుష్క లాగే ఉన్న అమెరికన్ సింగర్

ఈ భూమండలంపై మనుషుల్ని పోలిన మనుషులు కనీసం ఏడుమంది ఉంటారని చెబుతుంటారు. బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ ఇటీవల తనను పోలిన మరో వ్యక్తిని ఇంటర్నెట్ ద్వారా కనుగొన్నది.

అమెరికన్ సింగర్ జూలియా మైఖేల్స్ అచ్చు అనుష్కలానే ఉంది. రంగు ఒక్కటే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. తన రంగంలో పాపులర్ అయిన జూలియా ట్విట్టర్‌లో తన ఫొటో పక్కన అనుష్క ఫొటో పెట్టి చేసిన పోస్ట్ ఇండియాలో వైరల్‌గా మారింది.

“హాయ్ అనుష్కా.. చూడ్డానికి మనం కవలల మాదిరిగా ఉన్నాం. లాట్స్ ఆఫ్ లవ్” అనే కామెంట్ దానికి జోడించింది. వెంటనే స్పందించింది అనుష్క. “ఓ మై గాడ్. యెస్!! నేను నీ కోసం, మిగతా నాలాంటి పోలికలున్న ఐదుగురి కోసం నా జీవితమంతా వెతుకుతున్నా” అని సరదాగా జవాబిచ్చింది.

వృత్తి విషయానికి వస్తే, షారుఖ్ ఖాన్ సరసన చేసిన ‘జీరో’ సినిమా తర్వాత, కొత్తగా ఏ సినిమాకీ సంతకం చెయ్యలేదు అనుష్క.