Bellamkonda And Rakul Preet Pair Up Again


Bellamkonda And Rakul Preet Pair Up Again
Rakul Preet Singh and Bellakonda Sreenivas

మరోసారి బెల్లంకొండ, రకుల్‌ప్రీత్ జోడీ

హీరోయిన్ల ఎంపిక విషయంలో యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అగ్ర తారలు, క్రేజీ హీరోయిన్లన్లతోటే వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. సమంత, రకుల్‌ప్రీత్, పూజా హెగ్డే, కాజల్, మెహ్రీన్ వంటి తారలతో నటించిన శ్రీనివాస్, ఇప్పుడు మరోసారి రకుల్‌ప్రీత్ సింగ్‌తో జోడీ కడుతున్నాడు.

విష్ణు విశాల్ హీరోగా నటించగా గత ఏడాది తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘రాచ్చసన్’ (రాక్షసన్) సినిమాని తెలుగులో శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కుర్చీల్లో మునివేళ్లపై కూర్చోబెట్టిన బెస్ట్ థ్రిల్లర్‌గా అది ప్రశంసలు పొందింది. అందులో అమలా పాల్ హీరోయిన్‌గా నటించింది. ఆమె పాత్రకు తెలుగులో రకుల్‌ప్రీత్ ఎంపికైనట్లు సమాచారం.

తెలుగులో ఈ సినిమాను రమేశ్‌వర్మ డైరెక్ట్ చేయనున్నాడు. గత ఏడాది బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిరాశ చెందాడు. ప్రస్తుతం అతను తేజ దర్శకత్వంలో ‘సీత’ సినిమా చేస్తున్నాడు. తెలుగులో ఈ మధ్య స్పీడు తగ్గించిన రకుల్ ‘వెంకీమామ’లో నాగచైతన్య జోడీగా చేస్తోంది.