Comedy Actor Prithvi Appointed As A YSRCP Secretary


Comedy Actor Prithvi Appointed As A YSRCP Secretary
Actor Prithvi

వైఎస్సార్సీపీ సెక్రటరీ అయిన కమెడియన్ పృథ్వీ

కమెడియన్‌గా తెలుగు సినిమాల్లో తనదైన ముద్రవేసిన పృథ్వీ రాజకీయ రంగంలో పెద్ద అడుగు వేశారు. ‘థర్టీ యియర్స్ ఇండస్ట్రీ పృథ్వీ’గా పేరుపొందిన ఆయనను వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది.

పృథ్వీ పూర్తి పేరు బలిరెడ్డి పృథ్వీరాజ్. ఆయనది కృష్ణా జిల్లా. చాలా కాలం నుంచే ఆయన వైఎస్సార్‌సీపీ కార్యకలాపాల్లో పాల్గొంటూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్నీ, ముఖ్యమంత్రి చంద్రబాబునూ విమర్శిస్తూ వస్తున్నారు. మేలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆయనకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేకతను తన ప్రసంగాల ద్వారా పృథ్వీ బాగా తీసుకెళ్లగరని జగన్ విశ్వసిస్తున్నట్లు సమాచారం.

కాగా దశాబ్దాల కాలం నుంచే నటిస్తూ వస్తున్నప్పటికీ ‘లౌక్యం’ సినిమాతో కమెడియన్‌గా పృథ్వీ మంచి డిమాండ్ సంపాదించారు. తర్వాత కాలంలో బ్రహ్మానందంకు సరైన ప్రత్యామ్నాయంగా కూడా ఆయనను భావించారు కానీ, ఎందుకనో మళ్లీ నెమ్మదించారు.