Confirmed: Total Dhamaal Not Releasing In Pakistan


Confirmed: Total Dhamaal Not Releasing In Pakistan

పాకిస్తాన్‌లో ‘టోటల్ ధమాల్’ విడుదల కావట్లేదు

అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్ర పోషించిన ‘టోటల్ ధమాల్’ సినిమా పాకిస్తాన్‌లో విడుదల కావట్లేదు. ఈ విషయాన్ని సోమవారం దేవ్‌గణ్ తన ట్విట్టర్ పేజీ ద్వారా ప్రకటించాడు. 40 మందికి పైగా జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పాడు.

“ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్‌లో సినిమాని రిలీజ్ చెయ్యకూడదని ‘టోటల్ ధమాల్’ టీం నిర్ణయించింది” అని ఆయన ట్వీట్ చేశాడు.

ఇంద్రకుమార్ డైరెక్ట్ చేసిన ‘టోటల్ ధమాల్’లో దేవ్‌గణ్‌తో పాటు అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, రితీశ్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సి, జావెద్ జాఫ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్ దేవ్‌గణ్ ఫిలిమ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ పూర్తి స్థాయి కామెడీ  సినిమా ఫిబ్రవరి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

 పుల్వామా టెర్రర్ ఎటాక్‌ను ఖండించిన బాలీవుడ్ సెలబ్రిటీల్లో దేవ్‌గణ్ కూడా ఉన్నాడు. “హారిబుల్ అండ్ డిస్‌గస్టింగ్. యాంగర్ కాంట్ బి పుట్ ఇంటు వోర్డ్స్. #కశ్మీర్ టెర్రర్ ఎటాక్” అని ట్వీట్ చేశాడు దేవ్‌గణ్.