‘Crazy Crazy Feeling’ Releasing On February 22


'Crazy Crazy Feeling' Releasing On February 22

ఫిబ్రవరి 22న ‘క్రేజీ కేజీ ఫీలింగ్’ విడుదల

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం ” క్రేజీ క్రేజీ ఫీలింగ్ “. విష్వoత్, పల్లక్ లల్వాని జంటగా నటించిన ఈ చిత్రానికి సంజయ్ కార్తీక్ దర్శకుడు. ఇప్పటికే రిలీజయిన లిరికల్ వీడియోకు యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా దర్శకుడు సంజయ్ మాట్లాడుతూ .. ‘ప్రేమికుల మధ్య వుండే ఫీలింగ్స్ ని వినోదాత్మకంగా చూపిస్తున్నాం . వెన్నెల కిశోర్ ఇప్పటివరకు చేసిన పాత్రల కంటే లెంగ్తీ క్యారెక్టర్లో కనిపిస్తాడు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని, ముఖ్యంగా యూత్ ని ఎట్రాక్ట్ చేసే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల చేస్తున్నాము’ అని అన్నారు.

నిర్మాత మధు మాట్లాడుతూ .. ‘ప్రేమ , ఫీల్ , వినోదం ఈ మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు సంజయ్ యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా క్రేజీ క్రేజీ ఫీలింగ్ ని రూపొందిస్తున్నారు. వెన్నెల కిషోర్ గారి కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. భీమ్స్ మంచి పాటలందించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి . త్వరలోనే ఆడియో ఫంక్షన్ ను చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవ‌రి 22న విడుద‌ల చేయ‌నున్నాము. ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మిపిక్చ‌ర్స్ ద్వారా బాపిరాజు గారు విడుద‌ల చేస్తున్నారు’ అని అన్నారు.

నటీనటులు
విష్వoత్ , పల్లక్ లల్వాని ,వెన్నెల కిశోర్ , ఫిదా ఫేమ్ శరణ్య , సుమన్ , పోసాని తదితరులు

సాంకేతిక వర్గం
బ్యానర్ – విజ్ఞత ఫిలిమ్స్ పతాకం
సంగీతం – భీమ్స్ సిసిరోలియో,
సాహిత్యం – సురేష్ ఉపాధ్యాయ , కాసర్ల శ్యామ్ ,
కెమెరా – సుభాష్ దొంతి ,
ఆర్ట్ – నాగు ,
కొరియోగ్రఫీ – రాజకిరణ్ , చార్లీ
పిఆర్వో – ఏలూరు శ్రీను
నిర్మాత – నూతలపాటి మధు
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – సంజయ్ కార్తీక్