Dil Raju To Work With Jawaan Director

‘జవాన్’ డైరెక్టర్‌కి ఛాన్సిస్తున్న దిల్ రాజు
ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకు, కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న దర్శకులకు సైతం అవకాశాలిచ్చి వాళ్లను లైంలైట్‌లోకి తేవడం దిల్ రాజు నైజం. రీసెంట్గా చూసుకుంటే వాసువర్మ, వేణు శ్రీరాం, సతీశ్ వేగేశ్న వంటి దర్శకులు ఇందుకు ఉదాహరణ.
ఇప్పుడు ప్రతిభావంతుడయ్యీ కెరీర్లో ఇబ్బదులు ఎదుర్కొంటున్న మరో దర్శకుడితో పని చేసేందుకు సిద్ధమవుతున్నాడు దిల్ రాజు. ఆ దర్శకుడు.. సినీ రచయితగా మంచి పేరు తెచ్చుకొని ‘వాంటెడ్’తో డైరెక్టర్‌గా మారిన బీవీఎస్ రవి.
గోపీచంద్‌తో తీసిన తొలి సినిమా డిజాస్టర్ అయినా, రెండో సినిమాతో హిట్ కొట్టొచ్చని ఆశించాడు రవి. కానీ సాయిధరం తేజ్‌తో రూపొందించిన ఆ సినిమా ‘జవాన్’ (2017) సైతం బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. అరుణాచల్ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాని దిల్ రాజు ప్రమోట్ చేసినా ఉపయోగం లేకపోయింది.
ఇప్పుడు తనే సొంతంగా రవికి అవకాశం ఇవ్వాలని రాజు సంకల్పించినట్లు సమాచారం. ఇప్పటికే రవి చెప్పిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ రాజుకు నచ్చిందని సమాచారం. ప్రస్తుతం ఆ స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నాడు రవి. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడవచ్చు.