First Single Lyrical From Kalyan Ram’s 118 Movie Will Be Out On 8 February


First Single Lyrical From Kalyan Ram's 118 Movie Will Be Out On 8 February

ఫిబ్రవరి 8న ‘చందమామే’ సింగిల్ వస్తోంది

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న స్టైలిష్ యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘118’. నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా న‌టించారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాని మార్చి 1న విడుదల చేస్తున్నట్లు నిర్మాత మహేష్ కోనేరు తెలిపారు.

కాగా ఈ సినిమాలో క‌ల్యాణ్ రామ్, షాలినీ పాండే జంటపై చిత్రీకరించిన ‘చందమామే..’ అనే పాట లిరికల్ వీడియోను ఫస్ట్ సింగిల్‌గా ఫిబ్రవరి 8 సాయంత్రం 5.40 గంటలకు రిలీజ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. శేఖర్ చంద్ర స్వరాలు కూర్చారు.

“నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌గారి ‘118’ టైటిల్ లోగో, ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌ను ఇప్పటికే విడుద‌ల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది . చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. క‌ల్యాణ్ రామ్‌గారి పాత్ర లుక్ ఎలా ఉంటుంద‌నే విష‌యంతో పాటు అస‌లు సినిమా ఏ జోన‌ర్‌లో తెర‌కెక్కింద‌నే విష‌యాన్ని టీజ‌ర్ ద్వారా చూపించాం. సీట్ ఎడ్జింగ్ థ్రిల్ల‌ర్ ఇది” అని ఆయన వివరించారు.