Fourth Girl For Vijay Devarkonda!


Fourth Girl For Vijay Devarkonda!
Vijay Devarakonda and Catherine Tresa

విజయ్ కోసం మరో తార!

విజయ్ దేవరకొండ గత ఏడాది ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలతో స్టార్ హీరోగా తన ఇమేజ్‌ను మరింత పెంచుకున్నాడు. ఇప్పుడతను రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి ‘డియర్ కామ్రేడ్’, మరొకటి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేస్తోన్న టైటిల్ ఖరారు కాని సినిమా. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు విజయ్.

ఈ సినిమాలో ఇప్పటికే ముగ్గురు తారలు విజయ్ సరసన నటిస్తున్నారు. వాళ్లు.. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఐజాబెల్లే లీటే. వీరిలో ఐజాబెల్లే ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో కాలేజీ డీన్ కూతురిగా అఖిల్ సరసన కొద్దిసేపు కనిపించింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరో తార కూడా ఈ సినిమాలో భాగమైంది. ఆమె కేథరిన్ ట్రెసా.

ఈ మధ్య ఆమె తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. విజయ్ సినిమాలో ఆమె గ్రే షేడ్స్ ఉన్న ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు అంతర్గత వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆమె పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఒకే సినిమాలో విజయ్‌తో ఇంతమంది తారలు నటిస్తుండటంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. కె.ఎస్. రామారావు సమర్పిస్తోన్న ఈ చిత్రంలో విజయ్ భిన్న దశలుండే ఆసక్తికరమైన కేరెక్టర్ చేస్తున్నాడు.