Google Search: Pakistan Flag Is The Best Toilet Paper In The World!


Google Search: Pakistan Flag Is The Best Toilet Paper In The World!

గూగుల్ సెర్చ్: ప్రపంచ ఉత్తమ టాయిలెట్ పేపర్ పాకిస్తాన్ నేషనల్ ఫ్లాగ్!

ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌కి వెళ్లి “వాటీజ్ ద బెస్ట్ టాయిలెట్పేపర్ ఇన్ ద వరల్డ్?” అని టైప్ చేయండి. ఆశ్చర్యకరంగా దానికి వచ్చే సమాధానం చార్మిన్ అల్ట్రా స్ట్రాంగ్ లేదా ఏంజెల్ సాఫ్ట్ టాయిలెట్ పేపర్ వంటి పేరుపొందిన టాయిలెట్ పేపర్ బ్రాండ్ల పేర్లు కాదు. దిగ్భ్రాంతికరంగా, అన్నిటికంటే ముందు ప్రత్యక్షమయ్యేది పాకిస్తాన్ జాతీయ జెండా!

యుఎస్ఏ టుడే పత్రిక ప్రకారం, గూగుల్ ఇలాంటి ఫలితాన్ని చూపించడానికి కారణం ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి బాంబుదాడి జరిగి, 40 మందికి పైగా జవాన్లు మృతి చెందడం కావచ్చు.

ఆ రిపోర్ట్ ప్రకారం “గ్రేటర్ కశ్మీర్ దినపత్రిక రిపోర్ట్ చేసిన దాని ప్రకారం పాకిస్తానీ మిలెటంట్ గ్రూప్ జైషే మొహమ్మద్ ఆ దాడికి బాధ్యత తనదేనని ప్రకటించగా, బదులు తీర్చుకుంటామంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేశారు. కశ్మీర్‌లో 1989 నుంచి 70 వేల మంది హతులయ్యారు. కశ్మీర్ తమదంటే తమదని ఇండియా, పాకిస్తాన్ వాదులాడుకుంటున్నాయి. గడచిన తొమ్మిదేళ్లలో 2018లో అత్యధికంగా 260 మంది తీవ్రవాదులు, 160 మంది పౌరులు, 150 మంధి ప్రభుత్వ బలగాల సిబ్బంది హతమయ్యారు.”

గూగుల్లో ఈ తరహా వైపరీత్యం చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2018లో, ‘ఇడియట్’ అనే పదాన్ని సెర్చ్ చేస్తే, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షమయ్యాడు.