KGF: Awesome Feat At The Box Office Continues


KGF: Awesome Feat At The Box Office Continues
KGF: Awesome Feat At The Box Office Continues

బాక్సాఫీస్ వద్ద ఆశ్చర్యపరుస్తున్న ‘కేజీఎఫ్’

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కె.జి.ఎఫ్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర అపూర్వమైన రీతిలో ఆడుతోంది. ఇప్పటికే యు.ఎస్.లో మళ్లీ విడుదలైన ఈ సినిమా తెలుగు వెర్షన్ ఇప్పుడు తెలంగాణలో ట్రేడ్ పండితుల్ని సైతం విస్మయపరుస్తోంది. విడుదలైన ఏడో హైదరాబాద్‌లో ఏకంగా 30 స్క్రీన్లలో నడుస్తుండటం విశేషాల్లోకెల్లా విశేషం.

ఈ సినిమాతో పాటు విడుదలైన ‘అంతరిక్షం’, ‘పడి పడి లేచే మనసు’ సినిమాల కథ బాక్సాఫీస్ వద్ద ఎప్పుడో ముగిసి, అమెజాన్ ప్రైం వీడియోలో నడుస్తోంది. సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్2’ సినిమా దిగ్విజయంగా థియేటర్లలో నడుస్తుంటే, ‘వినయ విధేయ రామ’, ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ సినిమాలు థియేటర్ల నుంచి తప్పుకున్నాయి. వాటి విడుదల సమయంలో ‘కె.జి.ఎఫ్’ బాగానే ఆడుతున్నా తప్పనిసరిగా తీసేయాల్సి వచ్చింది.

ఇన్నాళ్ల తర్వాత ఆ సినిమాల థియేటర్లను మళ్లీ ఆక్రమించింది యశ్ సినిమా. హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ జిల్లాల్లోనూ ఈ సినిమా ఆడుతోంది. ఇలాంటి ఫీట్ ఇటీవల ఏ తెలుగు సినిమాకూ మనం చూడలేదు. కన్నడం నుంచి వచ్చిన ఒక డబ్బింగ్ సినిమా ఇలా ఆడుతుండటం అసాధారణం.

సినిమా నచ్చితే హీరో ఎవరు, అది ఏ భాష నుంచి వచ్చిందనేది ప్రేక్షకులు పట్టించుకోరని చెప్పడానికి నిఖార్సయిన ఉదాహరణగా నిలుస్తోంది ‘కె.జి.ఎఫ్’.

KGF: Awesome Feat At The Box Office Continues
Theatres list of KGF