Mahesh Has No Any Kind Of Political Ambitions: Namrata


Mahesh Has No Any Kind Of Political Ambitions: Namrata
Namrata and Mahesh

మహేశ్ రాజకీయాల్లోకి రాడు, ఆయనకు అంత తీరిక లేదు: నమ్రత

రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మహేశ్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన భార్య నమ్రత తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఒకసారికి మించి మహేశ్ కనిపించడం ఆ ప్రచారానికి ఊతమిచ్చింది.

పైగా మహేశ్ బాబాయి ఆదిశేషగిరిరావు ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరారు. అందువల్ల కనీసం బాబాయి కోసమైనా మహేశ్ ఆ పార్టీ తరపున ప్రచారం చేయొచ్చని ఒక వర్గం మీడియా ప్రచారం మొదలుపెట్టింది. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ సుభాష్ కె. ఝాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ప్రచారాన్ని నమ్రత ఖండించారు.

రాష్ట్రాభివృద్ధికి ఆయన చేసిన కృషి వల్లే చంద్రబాబు అంటే మహేశ్‌కు గౌరవమనీ, చంద్రబాబుతో కలిసి కనిపించినంత మాత్రాన మహేశ్ రాజకీయ వ్యక్తి అయిపోడనీ ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ తరపునా ప్రచారం చేసే ఉద్దేశం కానీ, ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం కానీ మహేశ్‌కు లేవని నమ్రత స్పష్టం చేశారు.

అసలు మహేశ్‌కు రాజకీయ ఆకాంక్షలు లేవని కూడా ఆమె తేల్చేశారు. తన సినిమాల షూటింగ్‌లతో తన భర్త బిజీగా ఉంటున్నాడనీ, ఆయనకు తీరిక సమయం దొరికితే అది కుటుంబ సమయమే అవుతుందనీ ఆమె అన్నారు. కనీసం తన స్నేహితులను కలుసుకోడానికి కూడా మహేశ్ వెళ్లడని నమ్రత తెలిపారు.