Mahesh To Team Up With ‘F2’ Director For ‘Whats Up’?


Mahesh To Team Up With 'F2' Director For 'Whats Up'?
Mahesh and Anil Ravipudi

అనిల్ రావిపూడితో మహేశ్ ‘వాట్సప్’?

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ చేస్తోన్న ‘మహర్షి’ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 25న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘మహర్షి’ తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో నటించేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నాడు మహేశ్.

ఇంతలో మహేశ్ తదుపరి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉంటుందనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే మహేశ్‌కు అనిల్ కథ చెప్పడం, దానికి మహేశ్ ఓకే చెప్పడం నిజమే కానీ, ‘మహర్షి’ తర్వాత సుకుమార్‌తో కాకుండా, అనిల్‌తో పనిచేస్తాడనేది నిజం కాదని అంతర్గత వర్గాలు చెప్తున్నాయి.

మరోవైపు అనిల్ ఫిలించాంబర్‌లో ‘వాట్సప్’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. ఇది మహేశ్‌తో చేసే సినిమా టైటిల్ అని కూడా ప్రచారమవుతోంది. ‘పటాస్’, ‘రాజా ది గ్రేట్’ సినిమాలను యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌గా రూపొందించిన అనిల్ మరోసారి యాక్షన్‌కు ఎంటేర్‌టైన్‌మెంట్‌ను మేళవించిన సబ్జెక్ట్‌తో సినిమా చేయనున్నాడు.

అయితే ఇది సుకుమార్ సినిమా తర్వాతే ఉంటుందని మహేశ్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. గతంలోనూ మహేశ్ ఒకరితో సినిమా చేస్తానని ప్రకటించి కూడా మనసు మార్చుకొని వేరే దర్శకునితో పని చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడూ అలాగే జరుగుతుందా? చూడాలి.