Mahesh’s Maiden Web Series Titled As Charlie


Mahesh's Maiden Web Series Titled As Charlie
Mahesh’s Maiden Web Series Titled As Charlie

మహేశ్ తొలి వెబ్ సిరీస్ ‘చార్లీ’

ఓ వైపు నటిస్తూనే మరోవైపు రక రకాల ఆదాయ మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నాడు మహేశ్. అనేక ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా రెండు చేతులా సంపాదిస్తున్న అతను ఈ మధ్యే ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఏఎంబీ అనే మల్టీప్లెక్స్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించాడు. ఇప్పుడు జియో ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి డిజిటల్ బిజినెస్‌లో కాలు పెడుతున్నాడు. తొలిగా ఒక వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నాడు. ఆ సిరీస్‌కు ‘చార్లీ’ అనే టైటిల్ నిర్ణయించారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ రూపొందించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి పనిచేసిన హుస్సేన్ షా కిరణ్ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. డిటెక్టివ్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ సిరీస్‌లో 24 ఎపిసోడ్లు ఉంటాయి. 8 ఎపిసోడ్లు కలిపి ఒక సీజన్‌గా విడుదల చేస్తారు. పాన్-ఇండియా ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ వెబ్ సిరీస్‌ను తెలుగులో కాకుండా హిందీలో తీస్తుండటం గమనార్హం. ప్రస్తుతం మహేశ్ ‘మహర్షి’ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు వస్తోంది.