Manmathudu 2: Nagarjuna And Anushka To Pair Up Again

మన్మథుడు 2: మరోసారి జంటగా నాగ్, అనుష్క
నాగర్జున, అనుష్క జంటగా ఇప్పటికే ‘సూపర్’, ‘డాన్’, ‘రగడ’, ‘డమరుకం’ సినిమాల్లో జంటగా నటించారు. ప్రేక్షకుల్లో వాళ్ల జంటకు ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఇప్పుడు మరోసారి ఆ ఇద్దరూ జోడీగా కనిపించబోతున్నారు. దానికి వేదికగా నిలుస్తోన్న చిత్రం ‘మన్మథుడు 2’. నటుడి నుంచి దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ‘మన్మథుడు’కు సీక్వెల్‌ను రూపొందించనున్న విషయం తెలిసిందే.
రొమాంటిక్ డ్రామాగా కె. విజయభాస్కర్ రూపొందించిన ఒరిజినల్ ఫిల్మ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. త్రివిక్రం సమకూర్చిన స్క్రిప్ట్, డైలాగ్స్ ఆ సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. అందులో నాగ్ సరసన్ సోనాలీ బెంద్రే, అన్షు సరిగ్గా సరిపోయారు.
ఇప్పుడు ‘మన్మథుడు 2’కు సైతం రాహుల్ మంచి రొమాంటిక్ స్క్రిప్టును సమకూర్చినట్లు అంతర్గత వర్గాలు తెలిపాయి. ఒరిజినల్ తరహాలోనే ఇందులోనూ ఇద్దరు హీరోయిన్లు కనిపించనున్నారు. ఇప్పటికే రెండో హీరోయిన్గా ‘ఆర్ఎక్స్ 100’ ఫేం పాయల్ రాజ్‌పుట్‌ను ఎంపిక చేయగా, తాజాగా మెయిన్ హీరోయిన్ రోల్ కోసం అనుష్కను సంప్రదించారు. వేరే ఆలోచన లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అనుష్క.
మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తోంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తర్వాత అంతటి హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగ్ ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి.