Payal Rajput Replaces Shriya in Venky Mama?


Payal Rajput

చైతూ అత్తగా పాయల్?

వెంకటేశ్, నాగచైతన్య కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ రెగ్యులర్ షూట్ ఈ వారంలోనే మొదలు కాబోతోంది. ఇందులో వెంకీ, చైతూ మేనమామ, మేనల్లుళ్లుగా నటిస్తున్నారు. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డి. సురేశ్‌బాబు, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

చైతూ జోడీగా రకుల్‌ప్రీత్ నటిస్తుండగా, వెంకీ సరసన నాయికగా శ్రియ పేరు వినిపించింది. అయితే తాజాగా ఆమె స్థానంలోకి ‘ఆర్ఎక్స్ 100’ ఫ్రేం పాయల్ రాజ్‌పుత్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే నాగచైతన్యకు అత్తగా పాయల్ కనిపించనున్నట్లే. అయితే పాయల్ విషయం ఇంకా ఖారారు కావాల్సి ఉంది. నాగార్జున సినిమా ‘మన్మథుడు 2’లో ఇప్పటికే ఒక నాయికగా పాయల్ ఎంపికైన విషయం తెలిసిందే.

కథ ప్రకారం వెంకీ పల్లెటూరి వ్యక్తిగా, చైతూ సిటీలో చదువుకొనే అబ్బాయిగా కనిపించనున్నారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనున్నది. ఈ ఏడాది ద్వితీయర్థంలో ‘వెంకీ మామ’ను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.