Pulwama Attack: India Withdraws MFN Status To Pakistan, Custom Duty Raised To 200%


Pulwama Attack: India Withdraws MFN Status To Pakistan, Custom Duty Raised To 200%

పాకిస్తాన్ దిగుమతులపై 200 శాతం కస్టమ్ డ్యూటీ విధించిన భారత్

గడచిన దశాబ్ద కాలంలోనే అత్యంత పాశవిక దాడుల్లో ఒకదాన్ని ఎదుర్కొని కశ్మీర్ అతలాకుతలమవుతుండగా, పాకిస్తాన్‌కు ఇస్తూ వస్తున్న ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ (ఎంఎఫ్ఎన్) హోదాను భార త ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దాంతో ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపై 200 శాతం సరుకుల పన్ను (కస్టమ్ డ్యూటీ)ను వసూలు చేయనున్నారు.

ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) ఏర్పాటైన వెంటనే 1996లో పాకిస్తాన్‌కు కల్పించిన ‘ఎంఎఫ్ఎన్’ హోదాను తొలగించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోడానికి కారణం, పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తున్న జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సూసైడ్ బాంబర్ ఆదిల్ అహ్మద్ దర్ కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై చేసిన దాడి ఫలితంగా 40 మంది పైగా జవాన్లు చనిపోవడం.

కేంద్ర ఆర్థిక మంత్రి దీనిపై ట్వీట్ చేస్తూ “పాకిస్తాన్‌కు కల్పించిన ఎంఎఫ్ఎన్ హోదాను పుల్వామా ఘటన తర్వాత భారత్ ఉపసంహరించుకుంది. దీని కారణంగా, తక్షణమే పాక్ నుంచి ఇండియాకు దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై ప్రాథమిక కస్టమ్ డ్యూటీ 200 శాతం పెరుగుతుంది” అని ప్రకటించారు.