Quiz: How Well Do You Know ‘Gangotri’?


Quiz: How Well Do You Know 'Gangotri'?

క్విజ్: ‘గంగోత్రి’ గురించి మీకెంత తెలుసు?

అల్లు అర్జున్ కథానాయకుడిగా పరిచయమైన చిత్రం ‘గంగోత్రి’. ఆర్తీ అగర్వాల్ చెల్లెలు అదితీ అగర్వాల్ నాయికగా పరిచయమైన చిత్రం ‘గంగోత్రి’. కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పనితనం ఎలాంటిదో చూపించిన చిత్రం ‘గంగోత్రి’. బలమైన కథ, బలమైన సన్నివేశాలు, వినసొంపైన పాటలు, హృదయాన్ని ఆకట్టుకొనే భావోద్వేగాలతో ఘన విజయం సాధించింది ‘గంగోత్రి’. ఆ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలు ఎలా ఉన్నాయో పరీక్షించడానికే ఈ క్విజ్.

1. చిన్నప్పుడు గంగోత్రి పుట్టినరోజు వేడుకలో ఆమె తలపై పెద్దవాళ్లు ఏ పళ్లు వేస్తారు?

ఎ) నేరేడు పళ్లు  బి) ద్రాక్ష పళ్లు  సి) రేగుపళ్లు

2. స్కూలు గేటును సుమోతో విరగ్గొట్టి లోపలికి వెళ్లేదెవరు?

ఎ) సుమన్  బి) ప్రకాశ్‌రాజ్  సి) తెలంగాణ శకుంతల

3) ప్రకాశ్‌రాజ్‌ను బాంబు దాడి నుంచి కాపాడటానికి ప్రాణత్యాగం చేసేదెవరు?

ఎ) సీత  బి) సుమన్  సి) తెలంగాణ శకుంతల

4. పరీక్షలో కాపీ కొట్టమని గంగోత్రి కోసం గైడ్ తీసుకొచ్చేదెవరు?

ఎ) బ్రహ్మానందం  బి) సునీల్  సి) తనికెళ్ల భరణి

Quiz: How Well Do You Know 'Gangotri'?

5. గంగోత్రికి ఏ గండం ఉందని సిద్ధాంతి చెబుతాడు?

ఎ) అగ్నిగండం  బి) సర్పగండం  సి) జలగండం

6. నీలకంఠం నాయుడు (ప్రకాశ్‌రాజ్) మనుషుల నుంచి సింహాద్రి (అల్లు అర్జున్)ని కాపాడేది ఎవరు?

ఎ) ప్రగతి  బి) సుమన్  సి) సునీల్

7. నీలకంఠం నాయుడు మనుషుల నుంచి తప్పించుకోడానికి కొండ మీద నుంచి సింహాద్రి దేని మీదకు దూకుతాడు?

ఎ) లారీ  బి) రైలు  సి) బస్సు

8. నీలకంఠంను బాంబులతో చంపడానికి ప్లాన్ చేసేది ఎవరు?

ఎ) తనికెళ్ల భరణి  బి) తెలంగాణ శకుంతల  సి) బెనర్జీ

9. ప్రాణాలు కాపాడుకోడానికి కాశిలోని గంగోత్రికి వెళ్లిన సింహాద్రి అక్కడ తన కథను ఎవరికి చెబుతాడు?

ఎ) ఏవీఎస్  బి) తనికెళ్ల భరణి  సి) ఎమ్మెస్ నారాయణ

10. క్లైమాక్స్‌లో గంగోత్రిని చావమని చెప్పేదెవరు?

ఎ) తెలంగాణ శకుంతల  బి) ప్రగతి  సి) ప్రకాశ్‌రాజ్

Quiz: How Well Do You Know 'Gangotri'?

జవాబులు:  1. రేగుపళ్లు  2. తెలంగాణ శకుంతల  3. సీత  4. బ్రహ్మానందం  5. జలగండం  6. సుమన్  7. రైలు  8. బెనర్జీ  9. తనికెళ్ల భరణి  10. తెలంగాణ శకుంతల