క్విజ్: ‘మగధీర’ సినిమా మీకెంత గుర్తుంది?


క్విజ్: 'మగధీర' సినిమా మీకెంత గుర్తుంది?

ఒక మరాఠీ సినిమా స్ఫూర్తితో విజయేంద్రవర్మ తయారుచేసిన సబ్జెక్ట్ పదిహేనేళ్ల దాకా వెలుగు చూడలేదు. చివరకు రాంచరణ్ హీరోగా ఒక సినిమాని డైరెక్ట్ చేయాలని రాజమౌళి అనుకున్నప్పుడు, ఆయనకు శివాజీ అనుచరుడైన తానాజీ స్ఫూర్తితో తండ్రి రాసిన ఆ సబ్జెక్ట్ గుర్తుకు వచ్చింది. దానికి తనకు తోచిన మార్పులు చేసి, ‘మగధీర’ను సంకల్పించాడు.

రాజమౌళి ఏం కావాలంటే దాన్ని సమకూర్చిపెట్టారు నిర్మాతలు అల్లు అరవింద్, బీవీఎస్ఎన్ ప్రసాద్. పునర్జన్మ నేపథ్యంలో తయారైన ఆ సినిమా ఎలాంటి చరిత్రను సృష్టించిందో మనమే సాక్ష్యం. మునుపటి రికార్డులన్నింటినీ బాక్సాఫీసు వద్ద బద్దలుకొట్టిన ఈ సినిమా రాంచరణ్‌ను రాత్రికి రాత్రే పెద్ద స్టార్‌ను చేసేసింది. ఇది హీరోగా చరణ్‌కు కేవలం రెండో సినిమానే కావడం విశేషం. ఆ సినిమా సంగతులు మీకెంతవరకు జ్ఞాపకమున్నాయో చూద్దామా…

1. ‘మగధీర’ కథను ఎవరు రాశారు?

ఎ) శివశక్తి దత్తా  బి) వేదవ్యాస  సి) విజయేంద్రప్రసాద్

2. కాలభైరవ ఏ రాజ్యానికి రక్షకుడు?

ఎ) రత్నగిరి  బి) ఉదయగిరి  సి) అనంతగిరి

3. యువరాణి పేరు?

ఎ) అరవింద  బి) మిత్రవింద  సి) సునంద

4. మిత్రవింద రాజ్యంపైకి దండెత్తి వచ్చేదెవరు?

ఎ) షేర్ ఖాన్  బి) ఇమ్రాన్ ఖాన్  సి) జావెద్ ఖాన్

క్విజ్: 'మగధీర' సినిమా మీకెంత గుర్తుంది?

5. కాలభైరవను ఓడించి మిత్రవిందను పెళ్లాడాలనుకొనేది ఎవరు?

ఎ) షేర్ ఖాన్  బి) రాజసింహ  సి) రణదేవ్ బిల్లా

6. మిత్రవిందను పెళ్లాడవద్దని కాలభైరవను కోరేదెవరు?

ఎ) రణదేవ్ బిల్లా  బి) విక్రమసింహ  సి) భూపతివర్మ

7. మిత్రవిందను తీసుకొని కాలభైరవ ఏ గుడికి వెళ్తాడు?

ఎ) భైరవకోన  బి) తలకోన  సి) ప్రచండకోన

8. కాలభైరవ ఎవర్ని చంపి తాను చనిపోతాడు?

ఎ) విక్రమసింహ  బి) షేర్ ఖాన్  సి) రణదేవ్ బిల్లా

9) హర్షగా కాలభైరవ ఎన్నేళ్ల తర్వత తిరిగి జన్మిస్తాడు?

ఎ) 200 ఏళ్లు  బి) 300 ఏళ్లు  సి) 400 ఏళ్లు

10) ‘మగధీర’ తమిళ వెర్షన్ పేరు

ఎ) మన్నన్  బి) మావీరన్  సి) వీరన్

11) రఘువీర్, రణదేవ్ బిల్లా పాత్రలను పోషించిన నటుడు

ఎ) దేవ్ గిల్  బి) కబీర్ సింగ్  సి) రవి కిషన్

12) ‘బగారు కోడిపెట్ట’ రీమిక్స్ సాంగ్‌లో రాంచరణ్, ముమైత్ ఖాన్‌లతో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చిన నటుడు

ఎ) పవన్ కల్యాణ్  బి) నాగబాబు  సి) చిరంజీవి

క్విజ్: 'మగధీర' సినిమా మీకెంత గుర్తుంది?

జవాబులు: 1. విజయేంద్రప్రసాద్  2. ఉదయగిరి  3. మిత్రవింద  4. షేర్ ఖాన్  5. రణదేవ్ బిల్లా  6. విక్రమసింహ  7. భైరవకోన  8. రణదేవ్ బిల్లా  9. 400 ఏళ్లు  10. మావీరన్  11. దేవ్ గిల్  12. చిరంజీవి