Ram Charan Accepted Vinaya Vidheya Rama Result!


Ram Charan Accepted Vinaya Vidheya Rama Result!

‘వినయ విధేయ రామ’ ఓటమిని ఒప్పుకున్న రాంచరణ్!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తను హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ చిత్రం అంచనాలను అందుకోలేకపోయిందని రాంచరణ్ అంగీకరించారు. తనలోని హుందాతనాన్ని బయటపెట్టారు. భవిష్యత్తులో ప్రేక్షకులకు నచ్చే, మెచ్చే సినిమాలు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన వెలువరించారు చరణ్.

ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ‘వినయ విధేయ రామ’ విడుదలకు ముందు ఇటు ప్రేక్షకుల్లో, అటు బిజినెస్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ సృష్టించింది. ట్రైలర్‌తో ఆ క్రేజ్ అంబరాన్ని చుంబించింది. తీరా విడుదలయ్యాక ఇటు ప్రేక్షకులూ ఆదరించలేదు, అటు విమర్శకులూ మెచ్చలేదు.

పైగా సినిమాలోని అనేక సన్నివేశాలను పరిహాసం చేస్తూ సోషల్ మీడియాలో ట్రాలింగ్ జరిగింది. ఓవర్సీస్‌లో అతి దారుణంగా దెబ్బతిన్న ఈ సినిమా నైజాం, ఆంధ్ర ఏరియాల్లోనూ భారీ నష్టాల్ని చవి చూసింది. ఇప్పటికి చరణ్ ఆ సినిమా గురించి హుందాగా నోరు విప్పారు. ఆ ప్రకటనలో ఆయన ఏం చెప్పారో చూడండి…

Ram Charan Accepted Vinaya Vidheya Rama Result!
Ram Charan Accepted Vinaya Vidheya Rama Result!
Ram Charan Accepted Vinaya Vidheya Rama Result!
Ram Charan Accepted Vinaya Vidheya Rama Result!