Rana Signs A New Film


Rana Signs A New Film

విశ్వ‌శాంతి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో రానా, మిలింద్ రౌ కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం

బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి వంటి విభిన్న చిత్రాలతో తనదైన శైలి నటనతో ప్రేక్షకులను మెప్పించిన  రానా దగ్గుబాటి, ఇప్పుడు మరో విభిన్న కథాంశాన్ని ఎంచుకున్నారు. తాజాగా మరో తెలుగు సినిమాకు సైన్ చేశారు రానా. సిద్దార్ధ హీరోగా వచ్చిన హార‌ర్ థ్రిల్ల‌ర్‌ ‘గృహం’ సినిమా దర్శకుడు మిలింద్ రౌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు గాను దగ్గుబాటి రానా సైన్ చేశారు.

విశ్వ‌శాంతి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ర్ట్ వర్క్ పూర్తయిందని, ఆగస్టు నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారని ప్రకటించారు చిత్ర నిర్మాత. సినిమాలో ప‌నిచేయ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారు.

రానా ప్రస్తుతం హిందీలో ‘హాథీ మేరీ సాథీ’, ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాల్లో, తెలుగు, తమిళ భాషల్లో ‘1945’ సినిమాలో నటిస్తున్నారు.

One thought on “Rana Signs A New Film

Comments are closed.