Salman Khan’s Tiger Zinda Hai Telugu Remake On Cards?

సల్మాన్, కత్రినా పాత్రల్లో గోపీచంద్, తమన్నా?
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘టైగర్ జిందా హై’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రూ. 339 కోట్లను వసూలుచేసి, బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో 5వ స్థానంలో నిలిచింది.
ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాలీవుడ్లో వినిపిస్తోంది. ఒక ఇండియా గూఢచారి, ఇంకో పాకిస్తాన్ గూఢచారి కలిసి ఒక క్లిష్టమైన కార్యాన్ని ఎలా సాధించారనే అంశం ప్రధానంగా నడిచే ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులుగా గోపీచంద్, తమన్నా నటిస్తారనే ప్రచారం మొదలైంది.
2017 అఖరులో ‘టైగర్ జిందా హై’ సినిమా విడుదలైనప్పట్నుంచీ దాన్ని తెలుగులో చెయ్యాలని గోపీ ఆశపడుతూ వస్తున్నాడు. అయితే ఇది భారీ బడ్జెట్తో చెయ్యాల్సిన సినిమా కాబట్టి ఇప్పటి దాకా నిర్మాతలు ముందుకు రాలేదు. ఇప్పుడు ఆ సమస్య తీరిందనీ, ఒక పేరున్న నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించేందుకు అంగీకరించిందనీ అంటున్నారు.
త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
