Sree Vishnu’s New Film Titled Thipparaa Meesam


Sree Vishnu's New Film Titled Thipparaa Meesam
Sree Vishnu’s New Film Titled Thipparaa Meesam

శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’ ఫస్ట్ లుక్

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘తిప్పరా మీసం’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన  ఫస్ట్ లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ఇందులో శ్రీవిష్ణు లుక్ చాలా కొత్తగా ఉంది. పగిలిన కళ్లజోడు అతని క్యారెక్టరైజేషన్‌ను తెలియజేస్తోంది.

ఇదివరకు తీసిన ‘అసుర’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కృష్ణ విజయ్ ఎల్. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో శ్రీవిష్ణుతో ఈయనకు ఇదే తొలి సినిమా. యాక్షన్ డ్రామాగా ‘తిప్పరా మీసం’ తెరకెక్కుతోంది. నిక్కి తంబోలీ, రోహిణి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అచ్యుత్ రామారావు, బెనర్జీ, రవిప్రకాష్, రవి వర్మ, నవీన్ నేని, ప్రవీణ్, నేహా దేశ్‌పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, సిధ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది.

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ ఓం సినిమా బ్యానర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఈ చిత్రానికి ఎడిటర్: ధర్మేంద్ర కాకర్ల, ఆర్ట్: షర్మిల ఎలిశెట్టి, పి ఆర్ ఓ: వంశీ శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ మావిళ్ళ, నిర్మాత: రిజ్వాన్, రచన, దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్.