Tenali Ramakrishna BA BL: Sundeep Kishan And Hansika Begins Shooting For The Film


Tenali Ramakrishna BA BL: Sundeep Kishan And Hansika Begins Shooting For The Film
Sundeep Kishan, Hansika Motwani and G. Nageswara Reddy

‘తెనాలి రామకృష్ణ బి.ఎ., బి.ఎల్.’ షూటింగ్ మొదలైంది

సందీప్ కిషన్, హన్సిక తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బి.ఎ., బి.ఎల్.’. జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. కొంత కాలం క్రితం లాంఛనంగా నిర్మాణ పనులు ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం కర్నూలులో మొదలైంది. సందీప్, హన్సిక.. ఇద్దరూ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా దీన్ని నాగేశ్వరరెడ్డి రూపొందిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ ఒక ఆసక్తికర పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో మురళీశర్మ, వెన్నెల కిశోర్, పృథ్వీ, ప్రభాస్ శ్రీను కీలక పాత్రధారులు. శ్రీ నీలకంఠేశ్వరస్వామి క్రియేషన్స్ బేనర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర స్వరాలు కూరుస్తున్నాడు.

సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: ఇందుమూరి శ్రీనివాసులు, సహ నిర్మాతలు: రూప జగదీష్, వి. మహేశ్వర రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, స్టోరీ, స్క్రీన్ ప్లే: టి. రాజసింహ, స్క్రీన్ ప్లే: విక్రమ్ రాజ్, గోపాలకృష్ణ, ఆర్ట్: కిరణ్, ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్, మాటలు: నివాస్, భవాని ప్రసాద్, పీఆర్వో: వంశీ-శేఖర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, వెంకట్, లిరిక్స్: భాస్కరభట్ల, చందు.

Tenali Ramakrishna BA BL: Sundeep Kishan And Hansika Begins Shooting For The Film