Trivikram Searching For Another Girl Instead Of Kiara!


Trivikram Searching For Another Girl Instead Of Kiara!
Kiara Advani

బన్నీకి డేట్స్ ఇవ్వలేకపోతున్న తార

మహేశ్ సరసన ‘భరత్ అనే నేను’ సినిమాలో మెరుపులా మెరిసింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. తెలుగు హీరోయిన్‌గా రాణించాలంటే కావాల్సిన అపురూప లావణ్యం, అభినయ సామర్థ్యం.. రెండూ ఉన్న తారగా గుర్తింపు పొందింది. తెలుగు ప్రేక్షకుల్లో అనేకమంది అభిమానుల్ని సంపాదించుకుంది.

ఆ సినిమా తర్వాత రాంచరణ్ జోడీగా ‘వినయ విధేయ రామ’లో కనిపించింది ఈ ‘లస్ట్ స్టోరీస్’ గాళ్. ఆ సినిమా షూటింగ్ గత ఏడాదే ముగిసింది. సంక్రాంతికి సినిమా విడుదలై డిజాస్టర్ అయినా, గ్లామర్ పరంగా ఆ సినిమాలోనూ ఆమెకు ప్రశంసలే లభించాయి.

సాధారణంగా హీరోయిన్లు ఏక కాలంలో రెండు మూడు సినిమాలు చేస్తుంటారు. చిత్రంగా తెలుగులో ఇంతవరకూ మరో సినిమాకు సంతకం చెయ్యలేదు కియారా. త్రివిక్రం డైరెక్ట్ చేసే సినిమాలో అల్లు అర్జున సరసన ఆమెను తీసుకోబోతున్నారని వినిపించింది. కానీ ఇప్పటివరకూ ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం.

కారణం రెండు బాలీవుడ్ సినిమాలతో ఆమె బిజీగా ఉండటం. వాటిలో ఒకటి ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్ అయిన ‘కబీర్ సింగ్’ కాగా, మరొకటి ‘గుడ్ న్యూస్’ సినిమా. త్రివిక్రం సినిమాకు డేట్స్ సర్దుబాటు చెయ్యడం ఆమెకు క్లిష్టంగా మారిందనీ, దాంతో త్రివిక్రం మరో హీరోయిన్ అన్వేషణలో ఉన్నాడనీ వినిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారం వెల్లడి కావచ్చు.