Valentines Day Attraction: Send Proposal To Get To Meet iSmart Shankar


Valentines Day Attraction: Send Proposal To Get To Meet iSmart Shankar

‘ఇస్మార్ట్ శంకర్’కు ప్రపోజల్స్ పంపండి

ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డే సందర్భంగా ‘ఇస్మార్ట్ శంకర్’ నిర్మాతలు అమ్మాయిలకు ఒక ఆకర్షణీయమైన అవకాశాన్ని కల్పించారు. ఆ సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్న రాంను కలుసుకోవాలంటే అతనికి ఆకట్టుకొనే ప్రపోజల్స్‌ను పంపాలని సూచించారు.

నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ఈ విషయాన్ని వీడియో సందేశం ద్వారా ట్వీట్ చేశారు. వచ్చిన ప్రపోజల్స్‌లో నచ్చిన ఐదు ప్రపోజల్స్‌ను గురువారం ప్రకటిస్తామనీ, ఆ ప్రపోజల్స్ పంపిన అమ్మాయిలకు రాంను కలుసుకొని, అతనితో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తామని ఆమె తెలిపారు.

ఆ ప్రపోజల్స్ ‘ఇస్మార్ట్ గాళ్’ హ్యాష్‌టాగ్‌తో  హైదరాబాదీ స్టైల్లో ఉండాలనేది నిబంధన. ఇదే విషయాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ సైతం ట్వీట్ చేశారు.

రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ నాయికలుగా నటిస్తున్న ఈ సినిమా పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బేనర్‌పై లావణ్య సమర్పిస్తుండగా పూరి కనెక్ట్స్ బేనర్‌పై ఛార్మి నిర్మిస్తున్నారు.

Valentines Day Attraction: Send Proposal To Get To Meet iSmart Shankar