Varmaa Changes As Adithya Varma


Varmaa Changes As Adithya Varma

టైటిల్‌తో పాటు లుక్కూ మారింది!

ధ్రువ్ విక్రమ్ హీరోగా తమిళంలో రూపొందుతోన్న ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ టైటిల్ మారింది. ఇదివరకు బాలా డైరెక్ట్ చేసిన సినిమాకు ‘వర్మా’ అనే టైటిల్ పెట్టగా, ఇప్పుడు ఒరిజినల్ టైటిల్‌కు దగ్గరగా ఉండేలా ‘ఆదిత వర్మ’ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ డిజైన్ సైతం ఒరిజినల్‌ను తలపిస్తుండటం గమనార్హం.

అలాగే సినిమాలో ధ్రువ్ లుక్ కూడా విజయ్ దేవరకొండ లుక్ మాదిరిగానే పెద్ద గడ్డంతో కనిపిస్తోంది. అతి చిన్న మార్పులు మినహా ఒరిజినల్‌ను యథాతథంగా తియ్యడానికే నిర్మాణ సంస్థ ఇ4 ఎంటర్‌టైన్‌మెంట్ కట్టుబడి ఉంది. ఇక ముందే అనుకున్నట్లు దర్శకుడి స్థానంలోకి ‘అర్జున్ రెడ్డి’కి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన గిరీశాయ వచ్చాడు.

హీరోయిన్‌గా ఇప్పటికే బాలీవుడ్ ఫిల్మ్ ‘అక్టోబర్’ ఫేం బనితా సంధు ఎంపికవగా, ఒరిజినల్‌లో జియా శర్మ పోషించిన సెకండ్ హీరోయిన్ రోల్ కోసం ప్రియా ఆనంద్ ఎంపికైంది. తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచితురాలే. ‘లీడర్’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘కో అంటే కోటి’ చిత్రాల్లో ఆమె నాయికగా కనిపించింది.

రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, ‘వర్మా’కు మ్యూజిక్ ఇచ్చిన రాధన్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జూన్‌లో ‘ఆదిత్య వర్మ’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.