Venky Mama: The Venky & Chaitu Starrer To Go On Floors On 22 February


Venky Mama: The Venky & Chaitu Starrer To Go On Floors On 22 February

రాజమండ్రిలో మొదలవనున్న ‘వెంకీ మామ’ షూటింగ్

నిజ జీవితంలో మేనమామ, మేనల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగ చైతన్య ‘వెంకీ మామ’ అనే చిత్రంలో అవే పాత్రల్ని పోషించనున్న విషయం తెలిసిందే. కె.ఎస్. రవీంద్ర (బాబీ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌లోకి వెళ్లనున్నది.

అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం రాజమండ్రిలో ఫిబ్రవరి 22న షూటింగ్ మొదలు పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

వెంకీ సరసన శ్రియ, చైతూ జోడీగా రకుల్‌ప్రీత్ నటిస్తున్నారు. ‘సుభాష్ చంద్రబోస్’, ‘గోపాల గోపాల’ చిత్రాల తర్వాత వెంకీ, శ్రియ మూడోసారి జంటగా నటిస్తున్నారు. చైతు, రకుల్ జంటకు ఇది రెండో సినిమా. ఇదివరకు వాళ్ల కలయికలో వచ్చిన ‘రారందోయ్ వేడుక చూద్దాం’ పెద్ద హిట్టయింది.

‘ఎఫ్2’ సక్సెస్ తర్వాత వెంకీ మార్కెట్ విలువ అమాంతం పెరిగింది. ఆ సినిమాలో మునుపటి వెంకీ కనిపించాడనే పేరు వచ్చింది. పైగా ఆ సినిమా రూ. 75 కోట్లు వసూలు చేయడంలో వెంకీ నటన కీలకమైందనే విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘వెంకీ మామ’ నిర్మాతలు ఖుషీగా ఉన్నారు. ఖర్చు ఎక్కువ పెట్టడానికి వెనుకాడాల్సిన పని లేదనీ, సునాయాసంగా బిజినెస్ అవుతుందనీ వాళ్లు భావిస్తున్నారు.