Vijayendra Prasad To Pen The Kangana’s Biopic


Vijayendra Prasad To Pen The Kangana's Biopic
Kangana Ranaut and Vijayendra Prasad

కంగన బయోపిక్‌కు స్క్రిప్ట్ రాస్తున్న విజయేంద్రప్రసాద్

‘మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమాతో దర్శకురాలిగా మారిన కంగనా రనౌత్, దర్శకురాలిగా తన తర్వాతి సినిమాని ప్రకటించేసింది. ఈసారి ఆమె తన సొంత బయోపిక్‌నే డైరెక్ట్ చేయనున్నది. ఆ రకంగా ఒక రికార్డును కూడా సృష్టించనున్నది. ఇప్పటివరకూ తమ సొంత జీవిత చరిత్రను సినిమాగా రూపొందించిన దర్శకులెవరూ లేరు.

కాగా ఆమె బయోపిక్‌కు రచన చేస్తున్నది మరెవరో కాదు, రాజమౌళి తండ్రి, ‘మణికర్ణిక’కు కథ, స్క్రీన్‌ప్లేను అందించిన వి. విజయేంద్రప్రసాద్. ఈ విషయాన్ని కూడా కంగనే బయటపెట్టింది.

“ఇది నిజం. దర్శకురాలిగా నా తర్వాతి చిత్రానికి సబ్జెక్ట్ నా సొంత కథే. కానీ అది ప్రాపగాండా ఫిల్మ్ కాదు. అనేక చక్కని సందర్భాలున్న హృదయాన్ని స్పృశించే నా జీవిత ప్రయాణం. అది సిన్సియర్ ఫిల్మ్. నా చుట్టూ ఉన్న ఎంతోమంది ప్రేమించే మనుషులు నాకు ధైర్యాన్నిచ్చారు. వాళ్లెప్పుడూ నన్ను జడ్జ్ చెయ్యకుండా, నన్ను నన్నుగా అంగీకరించారు” అని చెప్పింది కంగన.

అయితే ఆ సినిమాలో తన నిజ జీవితంలో తనకు తారసపడిన వ్యక్తుల పేర్లు ఉండవని తెలిపింది కంగన. “నా జీవితంలోని ఎత్తుపల్లాలను చూపించాలనేది ఉద్దేశం. కొండ ప్రాంతం నుంచి బాలీవుడ్‌కు వచ్చిన ఒకమ్మాయి, ఈ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేని, ఆఖరికి ఒక గాడ్‌ఫాదర్ కూడా లేని ఒకమ్మాయి, అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని ‘గేంగ్‌స్టర్’, ‘తను వెడ్స్ మను’, ‘ఫ్యాషన్’, ‘క్వీన్’, ‘మణికర్ణిక’ వంటి కొన్ని మరవరాని చిత్రాల్ని చేసి విజేతగా నిల్చిందో, ఈ  క్రమంలో మూడు జాతీయ అవార్డుల్ని ఎట్లా సాధించిందనేది ఆ కథ” అని వివరించింది.

One thought on “Vijayendra Prasad To Pen The Kangana’s Biopic

Comments are closed.