Vinaya Vidheya Rama: The Story Ends At The Box Office

బాక్సాఫీస్ వద్ద ‘వినయ విధేయ రామ’ కథ ముగిసింది!
రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ‘వినయ విధేయ రామ’ సినిమా కథ బాక్సాఫీస్ వద్ద దాదాపు ముగిసింది. జనవరి 11న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 72.5 శాతం వసూళ్లు మాత్రమే సాధించగలిగింది. ఈ ఏరియాల్లో ఈ సినిమా ప్రి బిజినెస్ విలువ రూ. 76.6 కోట్లు కాగా, వసూలయ్యింది రూ. 55.6 కోట్లు. అంటే రూ. 21 కోట్ల డెఫిసిట్ అన్నమాట. వసూళ్ల సరళిని బట్టి ఇదివరకే రూ. 20 కోట్ల మేర నష్టాలు రావచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. అది నిజమైంది. నైజాం ఏరియాలో ఈ సినిమా భారీగా నష్టపోయింది. ఎందుకటే ఈ ఏరియాలో వసూలయ్యింది 63.4 శాతం మాత్రమే. ఈ ఏరియా ప్రి బిజినెస్ విలువ రూ. 20 కోట్లయితే, వచ్చింది రూ. 12.68 కోట్లని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. అంటే రూ. 7 కోట్ల పైగా నష్టాలు వాటిల్లాయి. ఇక ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోయారు. ఇక్కడ పెట్టుబడి విలువలో వసూలయ్యింది 21.4 శాతమే!