‘118’ తొలివారం వసూళ్లు: థ్రిల్లింగ్ హిట్


'118' తొలివారం వసూళ్లు: థ్రిల్లింగ్ హిట్

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘118’ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాల్ని రాబడుతోంది. సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ తెలుగులో తొలిసారి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొదటివారం ప్రపంచవ్యాప్తంగా రూ. 7.4 కోట్ల షేర్‌ను ఆర్జించింది.

నివేదా థామస్, షాలినీ పాండే హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ మౌత్ టాక్‌తో ప్రేక్షాదరణను పొందింది. ‘పటాస్’ తర్వాత కల్యాణ్‌రాంకు మరో హిట్‌గా నిలిచింది.

తొలి వారం నైజాంలో రూ. 2.85 కోట్ల షేర్‌ను సాధించిన ‘118’, ఆంధ్రా ఏరియాలో రూ. 2.65 కోట్లను, రాయలసీమలో రూ. 1.05 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. వెరసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 6.55 కోట్ల షేర్ రాబట్టింది. మిగతా ఏరియాలు, ఓవర్సీస్ కలుపుకొని ‘118’ సాధించిన మొత్తం వసూళ్లు రూ. 7.4 కోట్లుగా విశ్లేషకులు తేల్చారు.

ఈ సినిమా విజయంతో కల్యాణ్‌రామ్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. నిర్మాతగా తన కెరీర్‌లో ‘118’ మరవరాని సినిమాగా నిలిచిపోతుందని విడుదలకు ముందు చెప్పిన నిర్మాత మహేశ్ కోనేరు ముఖంలో నవ్వు విరుస్తోంది.

Related Articles: