45 వసంతాల ‘పెద్దలు మారాలి’


45 వసంతాల 'పెద్దలు మారాలి'

45 వసంతాల ‘పెద్దలు మారాలి’

పిల్లల్ని సక్రమంగా పెంచడం అసిధారా వ్రతం లాంటిది. పిల్లలు సక్రమ మార్గంలో పెరగడానికి క్రమశిక్షణ, ప్రేమాభిమానాలు ఎంత అవసరమో, వాటి మధ్య ఉండే సన్నని హద్దుని గ్రహించగలిగే సంస్కారం అంతే అవసరం. అది తెలియకపోతే ఎలాంటి అనర్థాలు వస్తాయో తెలిపే చిత్రం ‘పెద్దలు మారాలి’.

పి. చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శుభలక్ష్మీ ప్రొడక్షన్స్ బేనర్‌పై డి.ఎల్. నారాయణ, జి. మాధవరావు సంయుక్తంగా నిర్మించారు.

కృష్ణ, జమున భార్యాభర్తలుగా నటించిన ఈ చిత్రంలో గుమ్మడి, అంజలీదేవి, రమణారెడ్డి, మాడా, పండరీబాయి, నిర్మల, గీతాంజలి, అల్లు రామలింగయ్య, సత్యనారాయణ, సంధ్యారాణి, డాక్టర్ శివరామకృష్ణయ్య, సిహెచ్. కృష్ణమూర్తి, సారథి, కె.వి. చలం, మాస్టర్ రాము, బేబీ లుట్టి, మాస్టర్ విశ్వేశ్వరరావు, మాస్టర్ ఆదినారాయణ ఇతర పాత్రధారులు. అతిథి పాత్రలో జగ్గయ్య కనిపిస్తారు.

వి. సరోజిని కథ అందించగా, పి. చంగయ్య స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఆరుద్ర, సినారె రాసిన పాటలకు బి. గోపాలం స్వరాలు కూర్చారు. పాటల్ని ఘంటసాల, పి. సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్. ఈశ్వరి, కల్యాణి, రమ పాడారు. హీరాలాల్ కొరియోగ్రఫీ అందించారు.

వి.ఎస్.ఆర్. స్వామి ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రానికి కె. సత్యం ఎడిటింగ్ చేశారు. తోట వెంకటేశ్వరరావు కళా దర్శకత్వం అందించగా, ఎస్. స్వామినాథన్ స్టంట్స్‌కు రూపకల్పన చేశారు.

భర్త దూరంగా ఉన్నప్పుడు బిడ్డకి తనే సర్వస్వంగా మెలిగి, భర్త రాగానే బిడ్డను అలక్ష్యం చేసే తల్లిగా జమున, బిడ్డ మొండితనానికి కలతపడే తండ్రిగా కృష్ణ నటించారు. అలాగే బిడ్డని క్రమశిక్షణలో పెంచడం తన కర్తవ్యగా భావించే ఇంకో తండ్రిగా గుమ్మడి, నారు పోసినవాడు నీరూ పోస్తాడనే మెట్ట వేదాంతిగా రమణారెడ్డి కనిపిస్తారు.

45 వసంతాల 'పెద్దలు మారాలి'

45 వసంతాల ‘పెద్దలు మారాలి’ | actioncutok.com

You may also like: