80 years of Amma (1939)


80 years of Amma (1939)

80 ఏళ్ల ‘అమ్మ’ (1939)

లక్ష్మీరాజ్యం ప్రధాన పాత్ర పోషించిన ‘అమ్మ’ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా ఎనభై ఏళ్లు. అంటే 1939 మార్చి 16న విడుదలైంది. అరోరా ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి నిరంజన్ పాల్ దర్శకుడు. స్క్రిప్ట్ కూడా ఆయనే సమకూర్చారు. ఈ నిరంజన్ ఎవరో కాదు, స్వాతంత్ర్య సమరయోధుడు, సుప్రసిద్ధ జాతీయ నాయకుడు బిపిన్ చంద్ర పాల్ కుమారుడు.

లండన్‌లో స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకున్న నిరంజన్, ఆ తర్వాత ఫ్రాంజ్ ఆస్టెన్, హిమాన్షు రాయ్‌తో కలిసి భారతదేశపు తొలి ఫిల్మ్ స్టూడియోల్లో ఒకటైన బాంబే టాకీస్‌ను నెలకొల్పారు. ఆయన ఆత్మకథ ‘ఆయే జిబోన్’ 2001లో జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పురస్కారాన్ని పొందింది.

‘అమ్మ’ సినిమా తారాగణం, మిగతా సాంకేతిక నిపుణుల గురించిన సమాచారం అందుబాటులో లేదు. ఈ సినిమాని 1939 మార్చి 16న సెలెక్ట్ టాకీస్ (విశాఖపట్నం), క్రౌన్ టాకీస్ (కాకినాడ), ఇంపీరియల్ టాకీస్ (సికింద్రాబాద్)లో విడుదల చేశారు.

సెలెక్ట్ టాకీస్‌లో ఈ సినిమాని విడుదల చేసిన రోజు అంటే మార్చి 16న అప్పటి ఆంధ్రా యూనివర్సిటీ వై చాన్సలర్ సి.ఆర్. రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు. ఈ సినిమాని చూడ్డానికి జనం గుంపులు గుంపులుగా వచ్చినట్లు నిర్మాతలు ఇచ్చిన ప్రకటనలో తెలియజేశారు.

విశేషమేమంటే అదే ఏడాది తమిళంలోనూ ‘అమ్మ’ పేరుతో ఒక సినిమా విడుదలైతే, అదే పేరుతో తెలుగులోనూ అనువదించి విడుదల చేశారు. దానికి కె. వెంబు దర్శకుడు. అందులో లలిత, శాంతకుమారి వంటి నటీమణులు నటించారు. వి. దక్షిణామూర్తి సంగీతం సమకూర్చారు.

80 years of Amma (1939) | actioncutok.com