‘ఐరా’ రివ్యూ: రెండడుగులు ముందుకి, ఐదడుగులు వెనక్కి


'ఐరా' రివ్యూ: రెండడుగులు ముందుకి, ఐదడుగులు వెనక్కి

‘ఐరా’ రివ్యూ: రెండడుగులు ముందుకి, ఐదడుగులు వెనక్కి

తారాగణం: నయనతార, కళైయరసన్, యోగిబాబు, మనోబాల, ఎంఎస్ భాస్కర్

దర్శకత్వం: కె.ఎం. సర్జున్

విడుదల తేదీ: 28 మార్చి 2019

తెలుగు, తమిళ భాషల్లో ఈ మధ్య కాలంలో హారర్ థ్రిల్లర్లు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో చూసిన కథనే మళ్లీ చూశామనే ఫీలింగ్ కలుగుతోంది. నయనతార ఇటీవల చేసిన నాయిక ప్రధాన చిత్రాల్లో ఎక్కువగా థ్రిల్లర్లే కావడం గమనార్హం. అవన్నీ తెలుగులోనూ వస్తుండటం వల్ల థ్రిల్లర్లు మితిమించి పోతున్నాయనే భావన కలగడంలో తప్పు లేదు. 2 గంటల 20 నిమిషాల ‘ఐరా’ సినిమా ప్రేక్షకులను తక్కువ ఆకట్టుకొని, ఎక్కువగా విసిగించిందని చెప్పాలి.

యమున (నయనతార) అనే రిపోర్టర్ తన ఎడిటర్ తిరస్కారానికి గురై, తనేమిటో చూపించాలనే ఉద్దేశంతో సొంతంగా ఒక యూట్యూబ్ చానల్‌ను ప్రారంభిస్తుంది. అందులో భూతాల కథల్ని అప్‌లోడ్ చేసి, వాటి ద్వారా జనం దృష్టిని ఆకర్షించి, డబ్బు గడించాలన్నది ఆమె ఆలోచన.

'ఐరా' రివ్యూ: రెండడుగులు ముందుకి, ఐదడుగులు వెనక్కి

అందుకు భూత్ బంగ్లా మాదిరిగా కనిపించే అమ్మమ్మ ఇంటిని తగిన వేదికగా ఆమె ఎంచుకుంటుంది. ఇక్కడ మనకు నల్లటి దేహచ్ఛాయతో ఉండే భవాని (నయనతార) ప్రత్యక్షమవుతుంది. అయితే అది ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఒక ఊహాజనిత పాత్రగా కనిపించడం గమనార్హం.

ఒకదానికొకటి సంబంధం లేని అనేకానేక ఘటనలతో కథను నింపడంలో దర్శకుడి ఉద్దేశమేమిటనేది మనకు అంతుచిక్కదు. రోడ్ యాక్సిడెంట్, అర్ధరాత్రి ఖాళీగా ఉన్న ఒక ఇంట్లోకి ఇద్దరు పోలీసులు వెళ్లడం, కళైయరసన్ మృత దేహాలను తొక్కుకుంటూ వెళ్లడం.. వంటికి అందుకు ఉదాహరణలు.

కెమెరా పనితనం బాగానే ఉంది. అక్కడక్కడా భయపెట్టే సన్నివేశాలున్నాయి. కానీ చివరికొచ్చేసరికి మట్టిబొమ్మ పూర్తై, మెరుగులు దిద్దుతుండగా, వానొచ్చి మొత్తం కరిగిపోయినట్లు తుస్సుమనిపించింది.

'ఐరా' రివ్యూ: రెండడుగులు ముందుకి, ఐదడుగులు వెనక్కి

చివరగా తేలేదేమంటే, ‘ఐరా’ అనేది ఒక అతుకుల బొంత లాంటి సినిమా అని. పసలేని ఇతివృత్తం, అనాసక్తమైన కథనం, నిద్రలో నడుస్తున్నట్లుండే పాత్రలు.. ఇంతే! అసలు యమునను ఎవరో ఎందుకు వెంటాడుతుంటారనేది మనకు బోధపడదు. దర్శకుడికైనా తెలుసో, లేదో!

నయనతార నటనకు వంక పెట్టడానికేమీ లేదు కానీ, ఇలాంటి కథను ఆమె ఎందుకు ఎంచుకున్నదనేది అర్థం కాని ప్రశ్న. నయనతార వీరాభిమానులైనా ఈ సినిమాని ఇష్టపడతారా? డౌటే.

– వనమాలి

‘ఐరా’ రివ్యూ: రెండడుగులు ముందుకి, ఐదడుగులు వెనక్కి | actioncutok.com

You may also like: