ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా అజయ్ దేవ్‌గణ్!


ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా అజయ్ దేవ్‌గణ్!

బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్‌గా తెరపై కనిపించనున్నాడు. 1971లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో భుజ్ విమాన స్థావరం బాధ్యతలు వహించిన స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కార్ణిక్‌గా ఆయన నటించనున్నాడు. అభిషేక్ డుదయ్య దర్శకత్వం వహించే ఆ సినిమా పేరు ‘భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మించనున్నాడు.

“1971 యుద్ధంలో భారతదేశం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సాహస సైనికుడు, స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కార్ణిక్ గురించి నేటి తరానికే కాక, భవిష్యత్ తరాలకు కూడా తెలియజెయ్యాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీస్తున్నాం” అని భూషణ్ కుమార్ తెలిపాడు.

తన పాత్రను అజయ్ దేవ్‌గణ్ పోషించనున్నాడని తెలిశాక విజయ్ కార్ణిక్ సైతం తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా అజయ్ దేవ్‌గణ్ సినిమా ‘దే దే ప్యార్ దే’ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్, టాబు నటిస్తున్నారు.

ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా అజయ్ దేవ్‌గణ్! | actioncutok.com

You may also like: