‘ఆర్ ఆర్ ఆర్’ సెట్స్‌పై అలియా!


'ఆర్ ఆర్ ఆర్' సెట్స్‌పై అలియా!

దక్షిణాదిన తొలి సినిమా సెట్స్‌పై బాలీవుడ్ సంచలన తార అలియా భట్ అడుగుపెట్టింది. యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న ‘ఆర్ ఆర్ ఆర్’లో ఆమె రాంచరణ్ జోడీగా ఎంపికైన విషయం తెలిసిందే. ‘సీత’ అనే పాత్ర చేస్తోన్న ఆమె పూణేలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి.

నెల రోజుల పాటు ఆమె ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నట్లు ఆ వర్గాలు చెప్పాయి. కాగా ఇదే షెడ్యూల్లో బ్రిటిష్ తార డైసీ ఎడ్గార్ జోన్స్ కూడా పాల్గొంటున్నది. ఆమె జూనియర్ ఎన్టీఆర్ జోడీగా కనిపించనున్నది.

ఆంధ్ర ప్రాంతంలో మన్యం వీరునిగా సుప్రసిద్ధుడై తెల్లవాళ్లను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు (రాంచరణ్), తెలంగాణలో గోండు ప్రజల స్వాతంత్ర్యం కోసం నిజాం నవాబులపై పోరు సల్పిన గెరిల్లా యోధుడు కొమరం భీం (జూనియర్ ఎన్టీఆర్) పాత్రలతో రూపొందించిన కల్పిత కథతో రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

రామరాజు కాస్తా సీతారామరాజుగా మారడానికి కారణమైన సీత (అలియా) పాత్రను రాజమౌళి ఎలా తీర్చిదిద్దుతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. పూణే, అహ్మదాబాద్‌లలో ప్రస్తుత షెడ్యూల్ జరుగుతుంది.

‘ఆర్ ఆర్ ఆర్’ సెట్స్‌పై అలియా! | actioncutok.com

You may also like: