పెళ్లికి ముందే తల్లవుతున్న ‘2.0’ హీరోయిన్!


పెళ్లికి ముందే తల్లవుతున్న '2.0' హీరోయిన్!
Amy Jackson

పెళ్లికి ముందే తల్లవుతున్న ‘2.0’ హీరోయిన్!

రాంచరణ్ జోడీగా ‘ఎవడు’, రజనీకాంత్ సరసన ‘2.0’ సినిమాల్లో నటించిన అమీ జాక్సన్ పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రాం పేజీ ద్వారా తెలియజేసింది. తన ఫియాన్సీ జార్జ్ పనయిటౌ ద్వారా గర్భవతినైనట్లు ఆమె తెలిపింది. ఈ ఏడాది ఆరంభం రోజు వ్యాపారవేత్త జార్జితో ఆమెకు నిశ్చితార్థం జరిగింది.

యు.కె.లో మదర్స్ డే మార్చి 31న జరుపుకుంటారు. ఆ సందర్భంగా తను తల్లిని కాబోతున్నాననే విషయాన్ని ఆమె వెల్లడించింది.

జార్జ్ పనయిటౌ సరసన ఉండగా ఎత్తుగా పెరిగిన తన పొట్టను (బేబీ బంప్)ను చూపిస్తూ ఇన్‌స్టాగ్రాంలో ఫొటో షేర్ చేసింది అమీ. ఇది ఆమె అశేష అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. నాలుగేళ్లుగా ఆమె జార్జితో డేటింగ్ చేస్తోంది. నూతన సంవత్సరం వచ్చిన రోజు జార్జితో వేలికి ఉంగరం తొడిగించుకొని తమ నిశ్చితార్థాన్ని ఆమె ప్రకటించింది.

2020లో గ్రీస్‌లో ఆ ఇద్దరూ పెళ్లాడనున్నారని సమాచారం. అంటే ఈలోగానే ఆమె బిడ్డకు జన్మనిస్తుందన్న మాటే.

పెళ్లికి ముందే తల్లవుతున్న ‘2.0’ హీరోయిన్! | actioncutok.com

You may also like: