యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కామెడీని లోడ్ చేస్తున్నాడు!


యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కామెడీని లోడ్ చేస్తున్నాడు!

యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కామెడీని లోడ్ చేస్తున్నాడు!

‘మహర్షి’గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు మహేశ్. ‘మహానటి’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలు విడుదలైన మే 9న ఆ సినిమాని విడుదల చేయాలని సెంటిమెంట్‌గా వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ ప్లాన్ చేశారు. దిల్ రాజుతో కలిసి ఆయన ‘మహర్షి’ని నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసేందుకు మహేశ్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. జూన్‌లో ఈ సినిమాని ప్రారంభించాలని నిర్మాత అనిల్ సుంకర భావిస్తున్నాడు. ఈలోగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయాలని అనిల్ రావిపూడి సర్వ శక్తులూ ఒడ్డుతున్నాడు. అతనూ చెప్పిన లైన్‌కు మహేశ్ ఇప్పటికే ఓకే చెప్పాడు. అయితే పూర్తి స్క్రిప్టు అతనింకా వినలేదు.

ఈ నేపథ్యంలో ఆదివారం “నౌ ఇట్స్ నంబర్ 5.. లోడింగ్” అని ట్వీట్ చెయ్యడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దానర్థం తన ఐదో సినిమాకు స్క్రిప్టు సిద్ధం చేస్తున్నానని చెప్పడం. ఆ ఐదో సినిమా మహేశ్‌తో చేసేదే. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం యాక్షన్, కామెడీ మేళవింపుతో కథను తయారుచేశాడు అనిల్.

హీరో కేరెక్టర్‌ను పోలీసాఫీసర్‌గా మలిచినట్లు వినిపిస్తోంది కానీ అది నమ్మదగ్గట్లు లేదు. కారణం ఇప్పుడిప్పుడే పోలీసాఫీసర్‌గా చెయ్యడం మహేశ్‌కు ఇష్టం లేదని ఆ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో మహేశ్ జోడీగా రష్మికా మండన్న పేరు బలంగా వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకునిగా వ్యవహరించనున్నాడు.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కామెడీని లోడ్ చేస్తున్నాడు! | actioncutok.com

You may also like:

One thought on “యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కామెడీని లోడ్ చేస్తున్నాడు!

Comments are closed.