ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: పవన్ కల్యాణ్‌కు అంత ఈజీ కాదు!


ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: పవన్ కల్యాణ్‌కు అంత ఈజీ కాదు!
Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: పవన్ కల్యాణ్‌కు అంత ఈజీ కాదు!

విశాఖపట్నం జిల్లాలో గాజువాక అసెంబ్లీ నియోజక వర్గంపై అందరి దృష్టీ కేంద్రీకృతమవుతోంది. కారణం తెలిసిందే. ఇక్కడి నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. అగ్ర కథానాయకుడిగా రాణిస్తూ, సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ వేసి, రాజకీయలకు పూర్తి సమయం కేటాయిస్తున్న ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీని బరిలో నిలిపారు.

తాను స్వయంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి, విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేస్తున్నారు. భీమవరం కంటే గాజువాక పవన్‌కు మరింత సురక్షితమైందిగా ఆయనతో పాటు, జనసేన పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ నియోజక వర్గంలో అన్ని కులాల కంటే కాపు కలుస్తులు ఎక్కువ ఉండటం.

తనకు కులం ఎన్నడూ ముఖ్యం కాదని చెప్తూనే పవన్ తన కులస్తులు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాన్ని ఎన్నుకోవడం గమనార్హం.అయితే గాజువాకలో ఆయన గెలుపు అంత సునాయాసం కాదని పరిశీలకులు భావిస్తున్నారు.

పవన్ గెలుపెందాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందేనని వాళ్లు సూచిస్తున్నారు. ఇక్కడ ఆయన ప్రధానంగా ఇద్దరి నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు.

వారిలో ఒకరు టీడీపీ నుంచి బరిలో దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కాగా, మరొకరు వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి.

ఇక్కడ టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉండటం వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసరావు నుంచి పవన్‌కు తీవ్ర పోటీ నెలకొంది. అలా అని వైసీపీని తీసివెయ్యలేం. మునుపటి ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ నాగిరెడ్డికే జగన్ టికెట్ ఇచ్చారు. శ్రీనివాసరావు కంటే నాగిరెడ్డి వల్లే పవన్‌కు గెలుపు మరింత కష్టమవుతుందని కొంతమంది పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఎలా గట్టెక్కుతారో చూడాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: పవన్ కల్యాణ్‌కు అంత ఈజీ కాదు! | actioncutok.com

You may also like: