బాక్సాఫీస్: ఢమాల్.. ఢమాల్!


బాక్సాఫీస్: ఢమాల్.. ఢమాల్!

బాక్సాఫీస్: ఢమాల్.. ఢమాల్!

కల్యాణ్‌రామ్ సినిమా ‘118’ తర్వాత విడుదలైన ఒక్కో సినిమా బాక్సాఫీస్ వద్ద ఢమాల్ ఢమాల్ అని పడిపోతూ వస్తున్నాయి. ఈ వారం విడుదలైన డబ్బింగ్ సినిమా ‘పులిజూదం’, ‘వినరా సోదర వీర కుమారా’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాల్లో చివరి సినిమా ఒక వర్గం ప్రేక్షకుల్ని ఓ మాదిరిగా ఆకట్టుకుంటుండగా, మిగతా రెండూ ఢమాల్‌మన్నాయి.

మలయాళం, తమిళం, తెలుగు భాషలకు చెందిన నటులు మోహన్‌లాల్, విశాల్, శ్రీకాంత్ కలిసి నటించినప్పటికీ ‘పులిజూదం’ ఏమాత్రం ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించలేకపోతోంది. బాలనటుడి నుంచి హీరోగా ప్రమోషన్ పొందిన శ్రీనివాస సాయి నటించిన లవ్ స్టోరీ ‘వినరా సోదర వీరకుమారా’ చిత్రం యువత సహా ఎవర్నీ ఆకట్టుకోలేకపోతోంది.

తెలుగులోనే తొలి అడల్ట్ హారర్ కామెడీ సినిమాగా ప్రచారం పొందిన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ ట్రైలర్ వచ్చినప్పుడే జుగుప్స కలిగించింది. సినిమాలో ఆ తరహా చాలా సన్నివేశాలకు సెన్సార్ కత్తెర వేయడంతో ఆత్మ కోల్పోయిన కథ ఒక్క స్త్రీ ఆత్మనూ థియేటర్లకు రప్పించలేకపోతోంది.

మునుపటి వారం వచ్చిన ‘వేరీజ్ ది వెంకటలక్ష్మి’, ‘జెస్సీ’, ‘బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్’లలో ‘జెస్సీ’ విమర్శకుల ప్రశంసలనైనా పొందగలిగింది కానీ మిగతా రెండూ ఎవర్నీ మెప్పించలేక పూర్తిగా చతికిలపడ్డాయి.

బాక్సాఫీస్: ఢమాల్.. ఢమాల్! | actioncutok.com

You may also like:

One thought on “బాక్సాఫీస్: ఢమాల్.. ఢమాల్!

Comments are closed.