తేజ తడాఖా చూడాలి!


తేజ తడాఖా చూడాలి!
Teja

తేజ తడాఖా చూడాలి!

‘నేనే రాజు నేనే మంత్రి’ హిట్ తర్వాత కొంత విరామం తీసుకొని తేజ రూపొందిస్తున్న సినిమా ‘సీత’. నాయిక కేంద్రంగా కథ నడిచే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషిస్తోంది. తేజ డైరెక్షన్‌లో ఆమెకిది మూడో సినిమా. తేజ డైరెక్ట్ చేసిన ‘లక్ష్మీ కల్యాణం’ మూవీతోనే ఆమె తెలుగు ప్రేక్షకులకు నాయికగా పరిచయమైంది.

తేజ మునుపటి సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’లోనూ ఆమే నాయిక. ‘సీత’లో కాజల్ సరసన నాయకుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నాడు. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు సంకలిపించారు. అయితే షూటింగ్‌లో జాప్యం కారణంగా విడుదల పోస్ట్‌పోన్ కావచ్చని వినిపిస్తోంది.

ఆ సంగతి అలా ఉంచితే తేజపై ఇప్పుడో బాధ్యత ఉంది. ఈ మధ్య కాలంలో వరుసగా అతడికి రెండు హిట్లు లేవు. ఆ మాటకొస్తే ఎన్నో ఏళ్ల తర్వాత అతను ‘నేనే రాజు నేనే మంత్రి’తో హిట్ సాధించాడు. డైరెక్టర్‌గా కెరీర్ తొలినాళ్లలో తెలుగులో వరుసగా ‘నువ్వు నేను’, ‘జయం’ సినిమాలతో హిట్లు సాధించాక ఆ ఫీట్ మళ్లీ అతడికి సాధ్యం కాలేదు.

ఇప్పుడు రొమాంటిక్ డ్రామా ‘సీత’తో ఆ ఫీట్‌ను అతడు రిపీట్ చేసే అవకాశాలున్నాయని ఆ సినిమా బృందం గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. తేజ తడఖా ఎలా ఉంటుందో చూడాలి.

తేజ తడాఖా చూడాలి!
Bellamonda Srinivas and Kajal Aggarwal in ‘Sita’

తేజ తడాఖా చూడాలి! | actioncutok.com

You may also like: