ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఇంప్రెస్ చెయ్యడం అంత ఈజీ కాలేదు!


ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఇంప్రెస్ చెయ్యడం అంత ఈజీ కాలేదు!

మహేశ్ హీరోగా నటిస్తోన్న 25వ చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మ్యూజిక్ సెషన్స్ సందర్భంగా ఇద్దరు చక్కని అతిథులు తన దగ్గరకు వచ్చారని అతను తెలిపాడు.

“నా గిటార్, జెంబే (ఒక రకమైన డ్రమ్)లతో ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఇంప్రెస్ చెయ్యాలని చూశాను. కానీ అది అంత ఈజీ కాలేదు. కానీ ఎప్పుడూ లేనివిధంగా వాళ్లు తమ చురుకుదనంతో నన్ను ఆశ్చర్యపరిచారు, తమ క్యూట్‌నెస్‌తో నన్ను నవ్వించారు. ఎలాంటి హుషారైన సమయం గడిపాను. లవ్ యు కిడ్స్” అని తన ఇన్‌స్టాగ్రాం పేజీలో పోస్ట్ చేశాడు దేవిశ్రీ.

ఇంతకీ అతడ్ని అంతగా ఆశ్చర్యపర్చిన ఆ క్యూట్ కిడ్స్ ఎవరో కాదు.. మహేశ్ కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్య! ఆ సందర్భంగా తీసిన ఫొటోలను దేవిశ్రీ షేర్ చేశాడు. ఇప్పుడవి ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.

కాగా ‘మహర్షి’ చిత్రాన్ని మే 9న విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఇంప్రెస్ చెయ్యడం అంత ఈజీ కాలేదు!

ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఇంప్రెస్ చెయ్యడం అంత ఈజీ కాలేదు! – actioncutok.com

2 thoughts on “ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఇంప్రెస్ చెయ్యడం అంత ఈజీ కాలేదు!

Comments are closed.